వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం

Thu,July 19, 2018 04:16 AM

అమీర్‌పేట్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. మూడురోజుల పాటు జరిగిన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు రథోత్సవంతో ముగిశాయి. అందంగా అలంకరించిన రథం మీద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి విద్యుత్ దీపాల మధ్య అమ్మవారు పురవీధుల్లో ఊరేగించా రు. బుధవారం సాయంత్రం 6.30గంటలకు ప్రారంభమైన రథోత్సవం బల్కంపేట చౌరస్తా మీదుగా ఆర్‌అండ్‌బీ కార్యాలయం, గుడ్‌లక్ రెస్టారెంట్, ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీహాలు, ఎస్‌ఆర్‌నగర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం మీదుగా బీకేగూడ చౌరస్తా, భారతి నర్సింగ్‌హోమ్, 60ఫీట్ రోడ్డు మీదుగా బల్కంపేట దేవాలయానికి ఊరేగింపు చేరడంతో ఉత్సవాలు ముగిశాయి. ఈవేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, అమీర్‌పేట్ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ ఈవో ఎన్.వి.శర్మ, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్ కొత్తపల్లి సాయిగౌడ్, పాలక మండలి సభ్యులు అశోక్‌యాదవ్, హనుమంతరావు, ఉమానాథ్ గౌడ్, సింగారి శ్రీనివాస్, మోత్కుపల్లి రమేశ్‌తోపాటు టీఆర్‌ఎస్ నాయకులు సురేష్ గౌడ్, వనం శ్రీనివాస్, గోపీలాల్ చౌహాన్, ఎన్. గురవయ్య చారి, హరిసింగ్‌జాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంతకు ముందు దేవాలయంలో మహాశాంతి చండీ హోమం జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

బల్కంపేట వాసులకు కృతజ్ఞతలు...
ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు బల్కంపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మంత్రి తలసాని కృతజ్ఞతలు తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఆకలి తీర్చడంలో బల్కంపేట నివాసితులు మరోసారి తమ ఔధార్యాన్ని చాటుకున్నారన్నారు. వీరితోపాటు జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఆర్ అండ్‌బీ,రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖతో పాటు అన్ని వేడుకలకు సహకరించిన ప్రతి విభాగం అధికారులకు, వాలంటీర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా రాత్రింబవళ్ళు బందోబస్తు నిర్వహించిన పోలీస్ విభాగానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

262

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles