అమ్మకానికి ఉప్పల్ భగాయత్ ప్లాట్లు

Thu,July 12, 2018 01:04 AM

-రెండో విడుత ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ రెడీ
-67 మల్టీపర్పస్, 30 గిఫ్ట్ డీడ్ స్థలాలకు ఈ-వేలం
-రేపు నోటిఫికేషన్ జారీ
-గజం రూ. 37,500లుగా నిర్ణయం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మరో విడుతగా ప్లాట్ల వేలానికి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సిద్ధ్దమైంది. గత ఏప్రిల్ 20, 21, 22వ తేదీల్లో సంస్థ 183 ప్లాట్లను ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించారు. అంచనాలకు మించి రూ. 351కోట్ల ఆదాయాన్ని హెచ్‌ఎండీఏ ఖజానాలోకి సమకూర్చుకుంది. ఇదే స్ఫూర్తితో రెండో విడుతగా ఉప్పల్ భగాయత్ మల్టీపర్పస్ ప్లాట్లను ఎంపిక చేసింది. వీటితో పాటు తొలి వేలంలో మిగిలిన 30 గిఫ్ట్ డీడ్ స్థలాలను కూడా అమ్మకానికి పెట్టనున్నారు. అయితే ఉప్పల్ భగాయత్ భారీ లే అవుట్ స్థలాలను మూడు దశల్లో అమ్మకానికి పెట్టాలని నిర్ణయించిన కమిషనర్ చిరంజీవులు ఈ మేరకు తొలుత 67 ప్లాట్ల (1.9 లక్షల చదరపు గజాల)ను ఖరారు చేశారు. అయితే ఈ ప్లాట్లు మల్టీపర్పస్ ( ఏదైనా నిర్మాణం చేపట్టే అవకాశం) ఉండడంతో భారీగా డిమాండ్‌కు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. చదరపు గజం రూ. 37, 500లుగా ఖరారు చేశారు. ఈ -వేలం ప్రక్రియ నిర్వహణ బాధ్యతను గతంలో నిర్వహించిన ఎంఎస్‌టీసీ సంస్థకు కాకుండా ఈసారి ఐసీఐసీఐ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాట్లకు సంబంధించిన ఆన్‌లైన్ వేలానికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఈ సారి రూ. 700కోట్లపై గురి
రియల్ మార్కెట్‌కు అనుగుణంగా హెచ్‌ఎండీఏ అడుగులు వేస్తూ సంస్థ ఖజానాను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నది. హెచ్‌ఎండీఏ స్థలాలపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి అనుగుణంగా ఈ- వేలానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఉప్పల్‌లో రియల్ డిమాండ్ దృష్ట్యా కమర్షియల్ స్థలాలను ఈ- వేలం వేస్తున్నది. ఉప్పల్ భగాయత్ లే అవుట్ ఆనుకొని ఉన్న 72 ఎకరాల్లోనూ 2500-3300 చదరపు గజాల స్థలంలో ప్లాట్లు చేశారు. అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోరేడ్ బిల్డింగులే లక్ష్యంగా ఈ ప్లాట్లను మౌలిక వసతులతో తీర్చిదిద్దుతూ రూ. 35కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సైప్లె , గ్రీనరీ, ఎలక్ట్రిసిటీ పనులు చేపట్టారు. అత్యాధునిక హంగులతో ఈ లే అవుట్‌ను చేశారు. 1, 87 వేల స్కేర్ యార్డ్ స్థలంలో 2500, 3300 చదరపు గజాల ప్లాట్లను 67 వరకు చేసిన అధికారులు వీటిని ఈ-వేలంలో తొలుత తీసుకున్నారు. పక్కనే మెట్రో, వరంగల్ జాతీయ రహదారి దగ్గరగా ఉండడం ఈ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న అంచనా మేరకు వీటికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. రెండో విడుత ఈ -వేలం ద్వారా రూ. 700కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.

474

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles