మాన్‌సూన్ అలర్ట్


Thu,July 12, 2018 01:03 AM

-మేడ్చల్ జిల్లాలో విస్తృతంగా మెడికల్ క్యాంపులు
-ప్రాంతాల వారీగా అవగాహన సదస్సులు
-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నారాయణరావు
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. సీజనల్ వ్యాధులను ముందస్తుగానే గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పీహెచ్‌సీల వారీగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించి సీజనల్ వ్యాధులు సోకినప్పుడు తక్షణం తీసుకోవల్సిన చర్యలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించామని, అలాగే బస్తీలు, కాలనీలు, గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నారాయణరావు తెలిపారు. బుధవారం నమస్తే తెలంగాణతో మాట్లాడిన ఆయన జిల్లా పరిధిలోని 14 మండలాల పరిధిలో మండలస్థాయిలో హెల్త్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటి వరకు సుమారు 105 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా 9661 మందికి ఓపీ సేవలను అందించామని, జ్వరంతో బాధపడుతున్న 1464 మందికి చికిత్స అందిచామన్నారు. ప్రతిరోజు జిల్లాలో 621 వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ప్రాంతాల వారిగా పర్యటిస్తూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, ఈ బృందాలు ఇప్పటి వరకు 30,672 ఇండ్లను సందర్శించినట్లు తెలిపారు. దోమల బెడద ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్ చేయడంతో పాటు ప్రాంతాల వారీగా శానిటేషన్ కమిటీలను, ఆర్‌డబ్లూఎస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖల అధికారుల సమన్వయంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, పరిశుభ్రత వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్రమం తప్పకుండ సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఏఎన్‌ఎం సిబ్బంది తనిఖీలు చేసి వైద్యసేవలు అందిస్తున్నారని డీఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎక్కడా కూడా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు సోకలేదని తెలిపారు.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...