గిఫ్టు పేరెత్తితే.. ఫోన్ చేయండి


Sun,June 24, 2018 12:39 AM

-బురిడీ కొట్టించే ముఠాలపై నిఘా
-బహుమతులంటూ ఫోన్లు చేసే మాయగాళ్ల వలలో పడొద్దు
-లక్కీ డ్రాలో గెలుపొందారంటే గుడ్డిగా నమ్మొద్దు
-అనుమానిత కాల్స్‌పై పోలీసులకు సమాచారం ఇవ్వండి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బహుమతులు, గిఫ్టులు వచ్చాయంటూ ఫోన్ చేసి... అనంతరం మోసాలకు పాల్పడుతున్నారు. క్లబ్బుల్లో సభ్యత్వం, హాలీడే ప్యాకేజీలంటూ నమ్మించి మోసంచేసే ముఠాలపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెంచారు. గిప్టు వచ్చిందంటూ పిలిపిం చి.. పేపర్లలో వెంచర్లు చూపిస్తూ ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ అండ్ సర్వీసెస్ సంస్థ నిర్వాహకులు షేక్ ఖాదర్ భాష, విజయ్‌కుమార్‌లు మోసాలు చేస్తున్న విషయాన్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. భారీ సంఖ్యలో అమాయకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో ఇలాంటి నకిలీ వ్యాపారాలు చేస్తున్న వారెంతమంది ఉన్నారనే విషయం పై ఇప్పుడు నగర పోలీసులు దృష్టి సారించారు. బహుమతి ఆశ చూపిస్తూ.. మధ్యతరగతి ప్రజలనే ఎక్కువగా ఈ ముఠాలు మోసాలు చేస్తున్నాయి. కొనుగోలు చేసిన వస్తువులకు ఆయా సంస్థలు వేసే లక్కీ డ్రాలో తమ పేరు వచ్చిందనే నమ్మకంతో ఈ ముఠాలు చెప్పే మాటలు విని, చాలామంది నిండుగా మునిగిపోతున్నారు.

ఈ విషయా న్ని ఎవరికైనా చెప్పినా పరువు పోతుందని చాలామంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం లేదు. కొందరు వేలల్లో నష్టపోతే.. మరికొందరు లక్షల్లో నష్టపోతున్నారు. ఫోన్లు చేసి అమాయకులకు వలవేసే ముఠాలు తాత్కాలిక కార్యాలయాలు, హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి తమ క్లబ్బులో సభ్యులుగా చేరండంటూ ఒత్తిళ్లు చేస్తుంటా రు. ఎక్కడ కూడా ఇలాంటి ముఠాలు బలవంతం పెట్టిన ట్లు ఉండదు.. కానీ.. ఈ ముఠాలో కొందరు తియ్యటి మాటలు చెబుతుండగా.. మరికొందరు సాధ్యం కాని విషయాలను ఆర్థికంగా లాభపడుతారంటూ ఆశ చూపిస్తుంటారు. వాళ్లు చెప్పే మాటలు నిజమేనని నమ్మేసి చాలామంది జేబులో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులతో అడ్వాన్స్ లు చెల్లిస్తున్నారు. తీరా మొత్తం చెల్లించిన తరువాత కానీ... అది మోసమని తెలియడం లేదు. అప్పటికే ఆయా ముఠాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కార్యాలయాలను ఎత్తేస్తారు. క్లబ్ సభ్యత్వం తీసుకోవాలంటే.. ఆయా సంస్థలకు క్లబ్బు ఉండాలి. క్లబ్బులో అన్ని రకాలైన వసతులు ఉండాలి. ఇప్పుడు ఫోన్ చేసే ముఠాలకు అలాంటి క్లబ్బులు ఎక్కడా ఉండవు.

పర్యాటక ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తామంటూ..
గిఫ్టు పేరుతో రప్పించుకొని... తమ క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకుంటే మీకు గోవా, పుణే, ముంబై, కేరళ, బెంగుళూ రు, కొడైకెనాల్, తిరుపతి, యాదగిరిగుట్ట వంటి ప్రాం తాల్లో తక్కువ ధరకు ప్లాట్లు ఉన్నాయంటూ నమ్మబలుకుతారు. వారు చూపించే బ్రోచర్లను చూసి, నిజమేనని కొం దరు సభ్యులుగా చేరుతున్నారు. కొన్ని సందర్భాల్లో తమ క్లబ్బులో సభ్యత్వం తీసుకుంటే వివిధ రాష్ర్టాలకు వెళ్లినప్పుడు అక్కడి హోటల్స్‌లో డిస్కౌంట్లు వస్తాయంటూ నమ్మిస్తారు. ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో కొంత స్థలాన్ని కొని.. అదే తమ వెంచరంటూ నమ్మిస్తారు. వేల ల్లో సభ్యులుగా తీసుకున్నా.. అందరికీ ఒకటి, రెండు ప్రాం తాలను మాత్రమే చూపిస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు.

ఇదిలా ఉండగా.... నగరంలోని షాపింగ్ మాల్స్, సూపర్‌మార్కెట్లు, సినీ కాంప్లెక్స్‌లే వేదికగా చేసుకొని అక్కడకు వెళ్లే కస్టమర్ల ఫోన్ నెంబర్లను తీసుకుంటారు. తాము లక్కీ డ్రాకు కస్టమర్లను ఎంపిక చేస్తున్నామంటూ ఆయా షాపింగ్‌లకు వచ్చే వారికి చెప్పడతో.. ఎదో తమకు అదృ ష్టం వరిస్తుందనే నమ్మకంతో వెంటనే కస్టమర్లు కూడా ఫోన్ నెంబర్లను రాసి ఇస్తున్నారు. ఇదే ఇలాంటి ముఠాలకు వరంగా మారుతున్నది. ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నదెవరు అనే విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. కొన్ని సందర్భా ల్లో ఆయా షాపింగ్ మాల్స్‌లో విక్రయించే వివిధ రకాలైన వస్తువులకు సంబంధించిన కంపెనీ అంటూ లక్కీ డ్రా కో సం కస్టమర్ల వివరాలు తీసుకుంటున్నామంటూ నమ్మించే వారు సైతం ఉంటున్నారు.

గుడ్డిగా నమ్మి మోసపోవద్దు...
సులువుగా డబ్బు సంపాదించేందుకు నేర బుద్ధితో కొంద రు ఎన్నో రకాల ఎత్తులు వేస్తుంటారు. అందులో ఎగువ, దిగువ మధ్యతరగతి ప్రజలనే లక్ష్యంగా ఇలాంటి మోసా లు చేస్తుంటారు. ఏదీ కూడా ఊరికేనే రాదు.. ఎవరైనా ఫోన్ చేసి బహుమతి వచ్చిందంటే ఏమిటీ? ఎందుకు? అనే సందేహాలను అడగండి. ఫోన్ చేసిన వారు మాయ మాటలు చెప్పి ఫోన్లో మాట్లాడే వారిని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. స్వతహాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కష్టడపకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడడం వల్ల కష్టాలు, నష్టాలు వచ్చే ప్రమాదముంది. అనుమానిత ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిది. అక్కడ స్పందించకుంటే డయల్ 100, హాక్ ఐ, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అయినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. బహుమతుల పేరుతో వచ్చే ఫోన్లను గుడ్డిగా నమ్మి మోసపోవ ద్దు, మన జాగ్రత్తే శ్రీరామ రక్ష అనే విషయాన్ని ప్రతి ఒక్క రూ గుర్తించుకోవాలి.
- టాస్క్‌ఫోర్స్ డీసీపీ, రాథాకిషన్‌రావు

546
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...