ఓయూ టెక్నాలజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే


Sun,June 24, 2018 12:30 AM

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. 2014 - 2018 లో బీటెక్ పూర్తి చేసిన వారికి పట్టాలతో పాటుబంగారు పతకాలు, ర్యాంకు సర్టిఫికెట్లు అందజేశారు. టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్. శ్యాంసుందర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, గౌరవ అతిథిగా కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్, ఓఎన్జీసీ జీఎం సుల్గయ్ సత్యపాల్ హాజరై విద్యార్థులకు బంగారు పతకాలు, ర్యాంకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్లోబలైజేషన్ ప్రభావంతో విద్యార్థులకు అందుతున్న అవకాశాల గురించి వివరించారు.వేడుకల్లో గత విద్యా సంవత్సరంలో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో మౌనిక రామిని రెండు బంగారు పతకాలు, ఫుడ్ టెక్నాలజీలో లక్ష్మీచైతన్య, టెక్స్‌టైల్స్ టెక్నాలజీలో ఎల్ల శ్రీలేఖ బంగారు పతకాలు సాధించారు. కార్యక్రమంలో మొత్తం వంద మంది విద్యార్థులకు పట్టాలు, పదిమందికి ర్యాంకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఓయూ టెక్నాలజీ కళాశాల డీన్లు ప్రొఫెసర్ ఈ. నాగభూషణ్, ప్రొఫెసర్ కవితావాఘ్రే, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేశ్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ హయవదన, ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...