మనసున్న మంత్రి కేటీఆర్

Sat,June 23, 2018 12:20 AM

-మానవీయతను చాటిన కలెక్టర్ ఎంవీ రెడ్డి
-నిరుపేద విద్యార్థికి స్కూల్ అడ్మిషన్ ఇప్పించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు ట్వీట్
-మంత్రి ట్వీట్‌కు వెంటనే స్పందించిన కలెక్టర్ ఎంవీ రెడ్డి
-విద్యార్థి చదువుకు దొరికిన భరోసా
-అతడి తండ్రి వైద్యచికిత్సలకు సాయం చేస్తామని కలెక్టర్ హామీ
తండ్రి అనారోగ్యం కారణంగా 5వ తరగతిలోనే ఆగిన ఓ విద్యార్థి చదువుకు మనసున్న మంత్రి కేటీఆర్ చొరవతో భరోసా దొరికింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వెంటనే స్పందించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి విద్యార్థి చదువుకు, అతడి తండ్రి వైద్య చికిత్సలకు సాయం చేస్తామని హామీనిచ్చి మానవీయతను చాటారు.

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జ్ఞానేశ్వర్ సల్లకొండ అనే వ్యక్తి తన స్నేహితుడు గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, దీంతో అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా ప్రైవేటు స్కూల్స్‌లలో అధిక ఫీజులను చెల్లించలేక తన స్నేహితుడి కుమారుడు రిత్విక్ చదువు 5వ తరగతితోనే ఆగిపోయిందని, అతనిని ఘట్‌కేసర్ ప్రాంతంలోని గురుకుల పాఠశాలలో చేర్చించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సదరు ట్వీట్‌ను కలెక్టర్ డా.ఎంవీ రెడ్డికి రీట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై వెంటనే స్పందించిన కలెక్టర్ రిత్విక్, అతని కుటుంబ సభ్యుల ఇష్టానుసారం ఉప్పల్‌లోని సోషల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో గానీ, ఘట్‌కేసర్‌లోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌లో గాని చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిస్తూ కలెక్టర్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. రిత్విక్ తరుపు వ్యక్తులు ఉప్పల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నారాయణను 7995010644 నంబరులో, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజన్నను 9701111297 నంబర్‌కు ఫోన్ చేసి కలువాలని సూచిస్తూ కలెక్టర్ మంత్రికి రీట్వీట్ చేశారు. కలెక్టర్ రీట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యార్థి రిత్విక్ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీనిచ్చారు. రిత్విక్ కుటుంబ సభ్యులు ఎవ్వరైనా కీసరలోని కలెక్టర్ కార్యాలయంలో తనను నేరుగా సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఓ వ్యక్తి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్, మరోవైపు కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి వెంటనే స్పందించి ఓ పేద విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తూ ఇరువురు మానవీయతను చాటుకున్నారు.

265

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles