జిల్లాలో 97 శాతం పాసు పుస్తకాలు పంపిణీ


Fri,June 22, 2018 01:42 AM

-మిగిలిన వాటిని త్వరగా అందించాలి : రెవెన్యూ అధికారుల సమీక్షలో కలెక్టర్ డా.ఎంవీరెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్ : జిల్లాలో ఇప్పటి వరకు 97.09 శాతం మంది రైతులకు పట్టా, పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ డా.ఎంవీరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు పథకంలో పంపిణీ చేయని మిగిలిన పట్టా, పాసు పుస్తకాలను సత్వరమే రైతులకు అందించాలని ఆదేశించారు. ఇక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూ తగాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించడానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ అంశాలపై తహసీల్దార్లు కౌంటర్లు దాఖలు చేయాలని అన్నారు. ధరణీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్ సీడింగ్, పాస్‌బుక్ కరెప్షన్స్, సర్వేనంబర్, జండర్ కరెప్షన్స్, పేరు, జాబిత, మోటివేషన్, సోల్డ్‌ఔట్ కేసులు, డెత్ కేసులు, ఫొటో కరెప్షన్స్‌కి సంబంధించి మెర్జ్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బ్యాంకర్లను సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు సకాలంలో అందించాలని అన్నారు. దీంతో పాటు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై మండలాల వారీగా సమీక్షిస్తూ సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణలో భాగంగా ఇప్పటి వరకు మిల్లుల్లో మరపట్టించిన ధాన్యాన్ని వెంటనే ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు చేర్చడంలో విఫలమైన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7496.56 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాగా దీనికి గాను రైతులకు రూ.11.91 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.11.64 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన రూ.26 లక్షలను త్వరలోనే రైతులకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో విజయకుమారి, ఆర్డీఓలు లచ్చిరెడ్డి, మధుసూదన్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

252
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...