దేశాన్ని నడిపించేది విద్యార్థులే: కలెక్టర్

Fri,June 22, 2018 01:42 AM

-ఇష్టపడి చదివినప్పుడే మంచి ఫలితాలు
-ఎస్సెస్సీలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందజేత
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశాన్ని ముందుకు నడిపించే భావి అధికారులు విద్యార్థులేనని జిల్లా కలెక్టర్ డా. యోగితారాణా అభిప్రాయపడ్డారు. విద్యార్థులంతా ఉన్నతంగా చదివి, ఉత్తములుగా నిలువాలని ఆమె ఆకాంక్షించారు. నేటి విద్యార్థులే ఉత్తమ పౌరులుగా, ఉత్తమ అధికారులుగా దేశానికి సేవలందించాల్సిన అవసరముందన్నారు. గురువారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రతిభా పురస్కార ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సెస్సీలో తొమ్మిది కంటే అధికంగా జీపీఏ సాధించిన విద్యార్థులకు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, చేతి గడియారాలను అందజేశారు. జిల్లాలో 16 మండలాల పరిధిలో గల 125 మంది విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించిన కలెక్టర్ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని అభినందించారు. విద్యార్థులు చదువుపై దృష్టికి కేంద్రీకరించి ఇష్టపడి చదవాలని కలెక్టర్ ఉద్భోదించారు. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతిభను కనబరుస్తూ ఉత్తమ స్థానాలకు చేరుకోవాలన్నారు.

ప్రతిభావంతులుగా తీర్చిదిద్దండి..
ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణతను సాధించిన 14 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సైతం కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా వారందరికి గోడ గడియారాలను బహూకరించిన కలెక్టర్ రాబోవు రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. విద్యార్థులకు మంచి నాణ్యతతో కూడిన విద్యనందించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఇవే..
ప్రభుత్వ సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాల, హిమాయత్‌నగర్ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ మలక్‌పేట
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కాచిగూడ
ప్రభుత్వ బధిరుల ఉన్నత పాఠశాల మలక్‌పేట
ప్రభుత్వ ఉన్నత పాఠశాల సైదాబాద్
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల చంచల్‌గూడ
ప్రభుత్వ వికలాంగుల రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాల మలక్‌పేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అంబర్‌పేట ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాల మలక్‌పేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
కలాసిగూడ, సికింద్రాబాద్
ప్రభుత్వ అంధ బాలుర ఉన్నత పాఠశాల దారుషిఫా
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల డబీర్‌పుర
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం) గోషామహాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఘాజిపుర

309

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles