నేటి నుంచి ఉపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎంపిక

Thu,June 21, 2018 12:11 AM

-బదిలీకి దరఖాస్తు చేసుకుంటే ఆప్షన్ తప్పనిసరి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బదిలీలకు దరఖాస్తు చేసుకున్న హైదరాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయు లు నేటి (గురువారం) నుంచి వెబ్ ఆప్షన్‌ను తీసుకొనున్నారు. 8 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న 1700 మంది ఉపాధ్యాయులకు, 5 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న 31 మంది ప్రధానోపాధ్యాయులకు స్థానచలనం తప్పని సరి అని అధికారులు వివరిస్తున్నారు. అయితే వెబ్‌సైట్‌లో జిల్లా విద్యాశాఖ సూచించిన విధంగా ఖాళీ స్థానాల్లో తమ ఆప్షన్‌ను ఎంపిక చేయాలని అధికారులు సూచించారు. 761 మంది ఉపాధ్యాయులు తాత్కాలిక బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరు తమకు అనుకూలమైన ప్రాంతం ఆప్షన్ ఉంటే స్థానచలనం అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలోనే కొనసాగే అవకాశం ఉండేలా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఇచ్చిన ఆప్షన్‌లో అభ్యర్థలకు నచ్చిన ప్రాంతం లేకపోతే ఆ తర్వాత ఏ స్థానం ఖాళీగా ఉంటే ఆ ప్రాంతానికి మారే అవకాశం ఉంటుంది. ఈ వెబ్‌ఆప్షన్‌లో నేటి నుంచి ఆదివారం వరకు ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బదిలీకి దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థి తప్పకుండావెబ్ ఆప్షన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి వెబ్ ఆప్షన్‌లో పాల్గొనకుండా ఉంటే హోల్డ్‌లో పడే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగం ఎక్కడ చేయాలో అర్థంకాక అవస్థలు పడే అవకాశం ఉంది. కాబట్టి బదిలీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్‌లో పాల్గొనే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో ఎప్పుడు, ఎక్కడా లేనివిధంగా విద్యాశాఖలో బదిలీలు ఆన్‌లైన్‌లో జరగడం ప్ర ప్రథమం అని అధికారులు తెలిపారు.

ఆప్షన్లు ఇచ్చే సమయంలో తప్పులు దొర్లకుండా తగు చర్యలు తీసుకొని తమకు నచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. www.dcebhyderabad. webnote.in వెబ్‌సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు.

258

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles