రేపు రవీంద్రభారతిలో తెలంగాణ కొరియన్ కల్చరల్ ఫెస్టివల్

Thu,June 21, 2018 12:11 AM

ఖైరతాబాద్: తెలంగాణ, కొరియా సంస్కృతి ఒకే వేదికపై ప్రతి బింబించేలా ఈ నెల 22న రవీంద్రభారతిలో తెలంగాణ కొరి యన్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. బుధ వారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫెస్టివల్‌కు సంబంధించిన విశేషాలను వివరించారు. శతాబ్దాలుగా హైదరాబాద్ నగరం చరిత్రకు తా ర్కాణంగా నిలుస్తుందని, 1492 ప్రాంతంలో హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్‌షా కాలం, 1724 నిజాం పాల న నుంచి నేటి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ పాలన వరకు ఇక్కడ అన్ని కుల, మతాలకు నీడ కల్పిస్తున్న గొప్ప నగర మని అన్నారు. తమిళం, మలయాళం కన్నడం, కశ్మీరం అన్ని రాష్ర్టాలకు చెందిన వివిధ వర్గాలు నివాసయోగ్యమైన ప్రాంతం హైదరాబాద్ అని, మ్యూజియం ఆఫ్ కల్చర్‌గా విరాజిల్లుతోంద న్నారు. అదే స్పూర్తిని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగనిస్తున్నారని, కాస్మోపాలిటన్ సిటీగా ఉన్న హైద రాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నది ఆయన సంకల్పమని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, మెట్రో రైలుతో పాటు సంస్కృతి వారస త్వాన్ని పంచుకోవడం, ఇతర రాష్ర్టాలు, దేశాల మధ్య సుహృ ద్భావ వాతావరణం నెలకొల్పలాన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ మన్నారు.

హైదరాబాద్ నగరంలో కొరియన్, జపనీస్, టర్కీస్ 15 దేశాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడే స్థిరనివాసం ఏర్పా టు చేసుకున్నారని, వివిధ వ్యాపారాలు కలిగిన చిన్న దేశ మైన ప్పటికీ టెక్నాలజీకల్, కల్చరల్‌గా అడ్వాన్స్‌గా ఉందని, భార తీ యానికి, భారతదేశ తత్వానికి చాలా దగ్గరగా వారి సంస్కృతి ఉంటుందన్నారు. ఇప్పటికే టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి చేసుకుంటామని, ప్రపంచంలో సంగీతంలో విప్లవానికి నాంది పలికిన దేశాల్లో సౌత్ కొరియా ఒక్కటని, తెలుగు చలన చిత్రాల్లో సైతం అక్కడి కథలు, కథనాన్ని తీసుకున్న సందర్భాలు ఉన్నా యన్నారు. కొరియన్ అంబాసీ ప్రతినిధి రమ్య కృష్ణ మాట్లా డుతూ మన దేశ సంస్కృతికి కొరియన్ సంస్కృతితో ఎంతో దగ్గర పోలికలు ఉంటాయని, పెద్దలను గౌరవించడంతో పాటు మానవీయ విలువలను పాటించడంలో సమానంగా ఉంటుం దన్నారు. ప్రతి ఆగస్టు 15న మనం జరుపుకున్నట్లే సౌత్ కొరియా స్వాతంత్య్ర దినోత్సవం కూడా అదే రోజు ఉండటం విశేషమ న్నా రు. 22న మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5గంటల వర కు తెలంగాణ కొరియన్ కల్చరల్ ఫెస్టివల్‌తో పాటు పాప్ సం గీతానికి వేదికగా కే-పాప్ పేరుతో సంగీత విభావరి నిర్వ హి స్తున్నామన్నారు. ప్రతి ఏడాది మాదిరిగా ప్రత్యేక ఆకర్షణగా ఒగ్గు, డప్పు కార్యక్రమాలు నిలుస్తాయని తెలిపారు.

316

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles