పాతబస్తీలో..అభివృద్ధి పరుగులు

Wed,June 20, 2018 01:41 AM

-నేడు కిషన్‌బాగ్‌పార్కు ప్రారంభించనున్న
-మంత్రి కేటీఆర్
-బహదూర్‌పురా ైఫ్లెఓవర్‌కూ శంకుస్థాపన
చార్మినార్/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరవాసులకు అహ్లాదాన్ని పంచేందుకు కిషన్‌బాగ్ పార్క్ సిద్ధమైంది. చిన్నా, పెద్దలను అలరించేందుకు సుందరంగా రూపుదిద్దుకుంది. పచ్చని చెట్లకు తోడు వెలుగు జిలుగుల విద్యుద్దీపాలు, క్రీడామైదానం సందర్శకుల మనసుదోచుకుంటున్నాయి. నగరంలోని ఇతర పార్కులకంటే వైవిధ్యభరితమైన వసతులతో ఆకట్టుకుంటున్నది. దీంతో పాటు పాతనగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కిషన్‌బాగ్ పార్కును ప్రారంభించడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న బహదూర్‌పురా ైఫ్లెఓవర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ఆరు కోట్లతో...

నిన్నా, మొన్నటి దాకా స్థానిక ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటితో దుర్గంధం వెదజల్లే ప్రాంతం ఇప్పుడు ఊహించని రీతిలో ముస్తాబైంది. పాతనగరంలో పచ్చదనాన్ని పెంచడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కిషన్‌బాగ్ కుంటను అభివృధ్ధి చేయాలని సంకల్పించారు. వెను వెంటనే ప్రతిపాదనలు తయారు చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేయించారు. పార్క్ అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీ 6 కోట్ల 20 లక్షల నిధులను మంజూరు చేసింది. గత సంవత్సర కాలంగా జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనులు మే నెలలో పూర్తయ్యాయి.

పచ్చదనం

జీహెచ్‌ఎంసీ అధికారులు పచ్చదనానికి పెద్దపీట వేశారు. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న పార్క్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యానవన అధికారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గ్రీనరీతో ఎటు చూసినా పచ్చదనం ఉట్టిపడుతున్నది. పార్క్‌లోకి ప్రవేశించే ద్వారం నుండి నలువైపులా ఔషద మొక్కలను నాటినట్లు అధికారులు తెలిపారు. సుంగధ పరిమళాలు వెదజల్లే మొక్కలు సందర్శకులకు ఆకట్టుకుంటున్నాయి. పార్కులో ఏర్పాటు చేసిన లాన్‌లో ఇతర దేశాల నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకొన్న చెట్లతో పార్క్‌లో అహ్లాదభరిత వాతవరణం గోచరిస్తున్నది. ప్రత్యేకంగా పార్క్‌లో గ్రీనరీ కోసం సుమారుగా 35 లక్షల నిధులను వెచ్చించినట్లు ఉద్యానవన అధికారులు తెలిపారు.

ఎల్‌ఈడీ బెంచీలు

దేశంలోనే ప్రస్తుతానికి ఏ రాష్ట్రంలోనూ అందుబాటులో లేని విధంగా కిషన్‌బాగ్ పార్క్‌లో ప్రత్యేక సిట్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఎలక్ట్రిసిటి ఈఈ గణేష్ తెలిపారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇతర పార్క్‌లకు భిన్నంగా ఉండాలని కోరడంతో దేశంలోని వివిధ పార్క్‌లను పరిశీలించి అక్కడి వ్యవస్థలను తెలుసుకున్నామని తెలిపారు. 75 లక్షలతో పూర్తిస్థాయిలో లైటింగ్ వ్యవస్థను రూపొందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. కిషన్‌బాగ్ పార్క్‌లో ఎల్‌ఈడీ బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాటితోపాటు సందర్శకులను మరింతగా అలరించడానికి ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ కోసం బుల్లెట్ లైట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వాతావరణ మార్పులనూ తట్టుకునే విధంగా వాటిని తీర్చిదిద్దామని తెలిపారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బెంచీలు త్రివర్ణ పతాక రంగుల్లో వెలుగులను ప్రసరిస్తాయని తెలిపారు. అలాంటి బెంచీలు పార్క్‌లో మొత్తం ఐదు ఏర్పాటు చేశామన్నారు. 45 మీటర్ల వరకు ఎల్‌ఈడీ పుట్‌పాత్‌లను పార్క్‌లో తీర్చిదిద్దినట్లు తెలిపారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు సైతం ఎల్‌ఈడీ వెలుగులను ప్రసరిస్తాయని ఈఈ గణేష్ తెలిపారు.

నేడే ప్రారంభోత్సవం

బుధవారం కిషన్‌బాగ్ పార్కు ప్రారంభోత్స కార్యక్రమంలో రా్రష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మమూద్‌అలీ తోపాటు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే మౌజంఖాన్‌లు పాల్గొంటున్నారని జోనల్ కమిషనర్ రవి కిరణ్ తెలిపారు.

ైఫ్లెఓవర్‌కు శంకుస్థాపన

వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా బుధవారం పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు చేతులమీదుగా ఆరులేన్ల బహదూర్‌పుర ైఫ్లెఓవర్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, రూ. 6.20కోట్లతో అభివృద్ధిచేసిన కిషన్‌బాగ్ పార్కును కూడా మంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు పార్కును ప్రారంభించిన అనంతరం ైఫ్లెఓవర్ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ైఫ్లెఓవర్‌ను రూ. 69కోట్ల వ్యయంతో బహదూర్‌పుర జంక్షన్ మీదుగా 682మీటర్ల పొడవున నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీని నిర్మాణంతో పురానాపూల్ నుంచి జూపార్కు వెళ్లే మార్గంలో 90శాతం ట్రాఫిక్ సులువుగా వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. వచ్చే 2034నాటికి పెరిగే ట్రాఫిక్‌కు దృష్టిలో ఉంచుకొని ఈ ైఫ్లెఓవర్‌ను డిజైన్‌చేసినట్లు అధికారులు తెలిపారు. దీని నిర్మాణం వచ్చే ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ైఫ్లెఓవర్ విశేషాలు...

-పురానాపూల్ నుంచి జూపార్కు వరకు
-పొడవు - 682మీటర్లు
-వెలడ్పు - ఆరు లేన్లు (24మీటర్లు)
-వేగం గంటకు 40కి.మీ.లు
-స్థానికంగా 95శాతం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
-పురానాపూల్ నుంచి జూపార్కు వరకు జాతీయ రహదారి -44పై ట్రాఫిక్‌కు ఉపశమనం
-ప్రయాణ సమయం, ఇంధనం ఆదా

606

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles