బస్తీ దవాఖానల వైపు జనం చూపు


Wed,June 20, 2018 01:29 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే అమ్మో అనేవాళ్లు... కానీ ఇప్పుడు అవే సామాన్యుల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా మారాయి. పెద్దాసుపత్రులే కాదు.. బస్తీ దవాఖానాలు సైతం ఇప్పుడు ప్రజలకు అలాంటి విశ్వాసాన్ని కల్గిస్తున్నాయి. ప్రైవేటు దవాఖాన చుట్టూ తిరిగే కంటే అందుబాటులో ఉండే బస్తీ దవాఖానాకు వెళ్లడమే మంచిదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. కిక్కిరిసి కనిపిస్తున్న పలు బస్తీ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతుండడమే ఇందుకు నిదర్శనం. బి.జె.ఆర్ నగర్, గుడ్డిబౌలీ, హషీమాబాద్ బస్తీ దవాఖానలకు రోజూ 200ల మందికి పైగా రోగులు వస్తున్నారు. ఇప్పుడు ఈ వైద్య సేవల్ని మరిన్ని మురికివాడలకు విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఢిల్లీ తరహాలో..
ఢిల్లీలో విజయవంతంగా నడుస్తున్న మొహల్లా క్లీనిక్‌ల తరహాలోనే ప్రతి ఐదు నుంచి పదివేలమంది జనాభాకు ఒకటి చొప్పున నగరవ్యాప్తంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ నిర్ణయించారు. మేయర్ నేతృత్వంలోని ఓ బృందం ఢిల్లీలో విజయవంతంగా నడుస్తున్న మొహల్లా క్లీనిక్‌ల పనితీరును పరిశీలించి వాటికన్నా మరికొంత మెరుగ్గా పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానలకు రూపకల్పనచేశారు. ఇందులో భాగంగా మొదటిదశలో ఈ ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీన మల్కాజ్‌గిరి బి.జె.ఆర్. నగర్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 17బస్తీ దవాఖానాలను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.టి. రామారావు, వైద్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ దవాఖానల్లో ఓపీ సేవలు, కనీస వైద్య పరీక్షలు, స్వల్పకాల అనారోగ్యం కలిగేవారికి తక్షణ వైద్య చికిత్సలు, టీకాలు తదితర ఇమ్యునైజేషన్ సేవలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్, బీపీ, రక్తం, షుగర్ తదితర పరీక్షలు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. కావాల్సిన మందులు అందించే ఫార్మసి కూడా ఈ దవాఖానలో అందుబాటులో ఉంటుంది. గ్రేటర్‌లో 1451మురికివాడలుండగా అందులో 986నోటిఫైడ్, 465నాన్ నోటిఫైడ్ మురికివాడలు. అలాగే నగరంలో ప్రస్తుతం 112అర్బన్ హెల్త్ సెంటర్లు పనిచేస్తుండగా, అందులో 98ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా హెల్త్ సెంటర్లకు దూరంగా ఉండే మురికివాడల్లోనే ఈ బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన నిరుపయోగ కమ్యునిటీహాళ్లలో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన 17దవాఖానలు విజయవంతంగా పనిచేస్తున్నాయి.

సర్కిళ్లవారీగా బస్తీ దవాఖానలు..
ప్రశాసన్‌నగర్(జూబ్లీహిల్స్), నర్కిపూల్‌బాగ్(ఫలక్‌నుమా), అరుంధతినగర్(అంబర్‌పేట్), బాకారం(ముషీరాబాద్), గంగానగర్(అంబర్‌పేట్), గుడ్డిబౌలీ(మలక్‌పేట్), శంషాబాద్(ఫలక్‌నుమా), గడ్డిఅన్నారం(మలక్‌పేట్), చాచానెహ్రూ నగర్(అంబర్‌పేట్), శాంలాల్ బిల్డింగ్ బేగంపేట్(మల్కాజ్‌గిరి), ఎర్రకుంట(కాప్రా), రంగనాయకుల గుట్ట(హయత్‌నగర్), జీహెచ్‌ఎంసీ హౌసింగ్ బోర్డు(ఉప్పల్-2), ఇందిరాగాంధీపురం(ముసాపేట్), నందనవనం(ఎల్బీనగర్), బి.జె.ఆర్.నగర్(మల్కాజ్‌గిరి), ఎల్లమ్మబండ(కూకట్‌పల్లి).

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...