బాలికల సంరక్షణలో అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరం


Wed,June 20, 2018 01:27 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బాలికల సంరక్షణ, పిల్లలపై జరిగే లైంగిక అత్యాచార నిరోధానికి పాఠశాల కమిటీలు, తల్లిదండ్రులు సీసీ కెమెరాల మాదిరిగా నిఘా వేయాలని, సమాజం అభివృద్ధికై ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అన్ని వర్గాల వారి భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ యోగితా రాణా అన్నారు. బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శినీ ఆడిటోరియంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులకు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ అనే అంశంపై ఒక రోజు ఓరియెంటేషన్ ప్రొగ్రాం నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య, పౌష్టికాహారం అందజేయడంతో పాటు పిల్లల సంరక్షణ అన్నది టీచర్ల ముఖ్య బాధ్యతని కలెక్టర్ సూచించారు. లైంగిక వేధింపులు, రుతు పరి శుభ్రత, పౌష్టికాహారం అందించడం వంటి అంశాలపై ఎస్‌ఎంసి సభ్యులతో ఈ ఓరి యెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పిల్లలు తమని తాము రక్షించుకునే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రతి విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. బాలికలకు అవాంఛనీయ స్పర్శల పట్ల పూర్తి అవగాహన కల్పించాలన్నారు. సమాజం ఎదుర్కొంటున్న కొత్త సమస్య పిల్లలపై లైంగికదాడులు, దాడి జరిగిన తర్వాత వారికి న్యాయం చేస్తున్నామా? లేదా అని విచారణ చేయడం కన్నా నేరాలు జరగకుండా ఏ విధంగా అరికట్టగలం అనే విషయాన్ని తెలు సుకునే ఆచరించా లని మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ జి. వెంకట కృష్ణయ్య తెలిపారు. ఈ కేసులు అధిక సంఖ్యలో అమాయకులైన తెలుసుకునే శక్తి లేని పిల్లలపై జరుగుతున్నా యన్నారు. పిల్లలపై జరిగే అత్యాచారాల పట్ల స్పందించే తత్వం పెరగాలని దివ్యా దిశా సంస్థ డైరెక్టర్ ఫిలిప్స్ అన్నారు. డీఎం అండ్ హెచ్‌ఓ డా. పద్మజ, డిఈఓ వెంకట నర్సమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాజ్, జిల్లా వెల్ఫేర్ అధికారి సునంద పాల్గొన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...