లక్ష్యాన్ని ఎంచుకొని గమ్యాన్ని చేరండి


Wed,June 20, 2018 01:26 AM

దోమలగూడ: జీవిత లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే గమ్యాన్ని చేధించడం తథ్యమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం మధ్యమండలంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాణిగంజ్‌లోని గుజరాతి భవన్ ఏర్పాటు చేసిన ప్రీ రిక్రూట్‌మెంట్ ఫర్ ఎస్సై, కానిస్టేబుల్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 18 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, వాటిలో హైదరాబాద్ నగరంలో నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనునట్లు కమిషనర్ తెలిపారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు పెద్ద ఎత్తున యువతీ యువకులు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. శిక్షణ కేంద్రానికి పెద్ద ఎత్తున యువతులు రావడం గర్వంగా ఉంది, ప్రభుత్వంలో అన్ని శాఖలో పోలీస్ శాఖ అత్యంత ప్రాముఖ్యమైంది. యువత ఉద్యోగం సాధించిన తరువాత మరింత బాధ్యత పెరుగుతుందని, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సరైన మార్గంలో నడిచి సమాజ అభివృద్దికి తోడ్పడాలని సీపీ అంజనీకుమార్ విజ్ఞప్తి చేసారు. హైదారాబాద్ నగరానికి చెందిన 4000 వేల మంది యువత త్వరలో పోలీస్ శాఖకు సేవలు అందించనున్నారని, దీని కోసం పోలీసులు ఇచ్చే ఉచిత శిక్షణ కేంద్రాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సీపీ కోరారు. ఓటమి చూడని వారు భూ ప్రపంచంలో ఎవరు లేరని, ఓటమిని చేధించి ముందుకు రాణించిన వారే గొప్పవారని సీపీ అన్నారు.

ఇంత మంది యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్న భాగ్య కిరణ్ పోలీస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ భాగ్యకిరణ్‌తో పాటు పోలీసులు చేపట్టిన ఇటువంటి కార్యక్రమానికి తమ వంతు సహాయాన్ని అందచేస్తున్న ఎన్‌టీపీసీ సంస్థకు సీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అయితే గతంలో పశ్చిమ మండలంలోని మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిక్షణ తరగతులు నిర్వహించి సుమారు 280 మంది అభ్యర్దులకు ఉద్యోగం రావడానికి ఎంతో కృషి చేసిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సీఐ రాపోలు శ్రీనివాస్‌ను సీపీ అంజనీ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.యువత సమయాన్ని వృథా చేస్తుందని, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా చెడు మార్గం వైపు ఎక్కువ శాతం ఆకర్షితులైతున్నారని మధ్యమండలం డీసీపీ అన్నారు. లక్ష్యం లేకుండా ముందుకు సాగే జీవితానికి అర్ధం లేదని, ఉచిత శిక్షణ కేంద్రాన్ని యువత ఉపయోగించుకుని ఉద్యోగం సాధించేంత వరకు అలసి పోకుండా రాణించాలని డీసీపీ యువతకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మధ్యమండలం డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ సీ.హెచ్. సుధాకర్, చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనాధ్ రెడ్డి, గాంధీనగర్ డీఐ మంజుల, ఎస్సైలు రవీందర్, రమేష్ సురేష్, బాలకృష్ణ,ఎన్‌టీపీసీ రిజినల్ ఈడీ దుబే, జనరల్ మేనేజర్ హరి కుమార్, భాగ్య కిరణ్ పోలీస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ భాగ్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...