స్వచ్ఛందసంస్థలు పేద విద్యార్థులను ఆదుకోవాలి


Wed,June 20, 2018 01:26 AM

బషీర్‌బాగ్, జూన్ 19: పేద విద్యార్థులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు, చారిటబుల్ ట్రస్ట్‌లు ముందుకురావాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు కుందారం గణేషాచారి పిలుపునిచ్చారు. మంగళవారం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నేరెళ్ల గురుచరణం, సరోజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేరెళ్ల సరోజిని దేవి వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేషాచారి మాట్లాడుతూ.. ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్భందుల వలన కనీసం నోటు పుస్తకాలను కూడా కొనలేని స్థితిలో ఉన్నారని, అలాంటి వారికి నేరేళ్ల గురుచరణం, సరోజ చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారం అందించడానికి సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ అక్షరాల నిజం చేయాలని, పేదలకు సహకారం అందించినప్పుడే మానవ జీవితానికి సార్థకత ఉంటుందన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నేరెళ్ల గురుచరణం మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ విద్యాసంవత్సరం 500 మంది పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు చారిటబుల్ ట్రస్ట్ తరఫున పలు సహాయ సహకారాలు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.శ్రీరాములు, కార్యదర్శి వలబోజు నర్సింహాచారి, జాగృతి సికింద్రాబాద్ నియోజకవర్గం కన్వీనర్ పి.నరేందర్, చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్‌లు రాజేందర్ కుమార్, ఎన్.అరవింద్‌కుమార్, సెయింట్ జాన్సన్ పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...