రిజర్వాయర్ల అనుసంధానంతో అద్భుత ఫలితాలు

Wed,June 20, 2018 01:25 AM

-ఫజీ టెక్నాలజీపై మూడేండ్ల పరిశోధన
-త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం
-ఓయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఆంజనేయప్రసాద్
ఖైరతాబాద్, జూన్ 19: రిజర్వాయర్ల అనుసంధానంతో సాగు నీటిని అవసరమైన మేరకు వాడుకోవడంతోపాటు విద్యుత్ సైతం ఉత్పత్తి చేసుకోవచ్చని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సివిల్ ఇంజినీరింగ్ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఆంజనేయప్రసాద్ అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ఆధ్వర్యంలో సిములేషన్ మోడలింగ్ ఆఫ్ మల్టీ రిజర్వాయర్ సిస్టమ్ అండ్ పైప్ అనే అంశంపై సదస్సు జరిగింది. డాక్టర్ జీవీ సుబ్బారావు రెండో స్మారకోపన్యాస సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ.. గోదావరికి అనుసంధానంగా సింగూరు, శ్రీరాంసాగర్, అప్పర్, లోయర్ మానేరు తదితర రిజర్వాయర్లను అనుసంధానం చేయాలని, తద్వారా సాగు నీటి వినియోగం సక్రమంగా జరగడంతోపాటు 40 శాతం ఉన్న నీటి వేస్టేజ్‌ను 15 శాతానికి తీసుకువచ్చి ఆదా చేయవచ్చన్నారు. అంతేకాకుండా విద్యుత్‌ను సైతం అవసరమైన మేరకు ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తాము మూడేండ్ల పరిశోధన తర్వాత వాషింగ్ మిషన్లలో వాడే ఫజీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ మేరకు ప్రభుత్వానికి సైతం దీనిపై నివేదికలు సమర్పిస్తామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రిజర్వాయర్లను అనుసంధానం చేసి నీటిని వినియోగించుకోవచ్చన్నారు. ఈ సదస్సులో ఐఈఐ కార్యదర్శి డాక్టర్ జి.రామేశ్వర్‌రావు, సహాయ కార్యదర్శి డాక్టర్ జి. శ్రావణ్‌కుమార్, మాజీ చైర్మన్ నంద కుమార్ పాల్గొన్నారు.

271

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles