ఐదేండ్ల కష్టాలకు చెక్


Wed,June 13, 2018 03:23 AM

-మాదాపూర్ పాఠశాలకు అదనపు భవనం
-మరో పదిరోజుల్లో తరగతులు ప్రారంభం
-గదులు సరిపోక ఉదయం ప్రైమరీ, మధ్యాహ్నం హైస్కూల్ తరగతులు
కొండాపూర్: గత ఐదేండ్ల నుంచి మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలకు చెక్ పడనుంది. మరో పదిరోజుల్లో పాఠశాలకు అదనపు భవనం అందుబాటులోకి రానుంది. గదులు సరిపోక ఒకే పాఠశాల భవనంలో ఉదయం ప్రైమరీ, మధ్యా హ్నం హైస్కూల్ తరగతులు నిర్వ హిస్తున్నారు. దీంతో విద్యార్థుల చదువులకు ఇబ్బందిగా ఉండేది. ఐదేళ్ళ క్రితం నూతన భవన నిర్మాణానికి రూ. 30 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. కానీ నేటి వరకు భవన నిర్మాణం పూర్తి కాలేదు. నిధుల మంజూరులో ఆలస్యం లేనప్పటికీ కాంట్రాక్టర్ తీరుతోనే భవన నిర్మా ణం ఆలస్యమవుతుందని టీచర్లు తెలిపారు. గతేడాది భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పినప్నపటికీ నేటి వరకు పనులు జరుగుతునే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కాగా ఇకనైనా భవనాన్ని అందజేసేలా విద్యాశాఖ అధికారులు చొరవచూపాలంటున్నారు. ఒకే భవనం లో రెండు బడు లు కొనసాగుతుండడంతో బడి గంట కొట్టిన వెంటనే లోప ల ఉన్న విద్యార్థులు బయటకు వెళ్ళాల్సిందే లేదంటే బయ ట ఉన్న వారు గేటు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థులకు కలుగుతున్న ఈ అసౌకర్యాన్ని దూరం చేసేందుకు ఐదేండ్ల క్రితం అదనపు పాఠశాల భవన నిర్మాణం పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఆలస్య మై నా మరో పదిరోజుల్లో కొత్త భవనం అందుబాటులోకి వస్తుండడంతో విద్యార్థుల కష్టాలు దూరం కానున్నాయి.

481
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...