ఢిల్లీ, ముంబైలో తప్పించుకున్నారు..సిటీలో పట్టుబడ్డారు

Wed,May 16, 2018 12:40 AM

-ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠాకు సైబరాబాద్ పోలీసుల షాక్
-చైనా వెబ్‌సైట్‌లో స్కిమ్మర్‌ల కొనుగోలు
-ఏటీఎమ్ కేంద్రాల్లో బిగించిరహస్య కెమెరాలు పెట్టి
-లక్షలు దోచుకున్న ముఠాసెక్యూరిటీ గార్డుల్లేని ఏటీఎంలే టార్గెట్
-అర్ధరాత్రి వేళ..క్యాబ్‌లో వచ్చి దోపిడీ 2040 కార్డుల క్లోనింగ్
-550 మంది ఖాతాల్లో నగదు చోరీ మరో వారం రోజుల్లో
-ఉడాయించేందుకు ప్లాన్ భారీ దోపిడీని ఛేదించిన
-సైబరాబాద్ పోలీసులు రొమేనియా ఎంబసీకి నోటీసులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :దేశంలోనే తెలంగాణ పోలీసులు మరోసారి నెంబర్‌వన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ, ముంబై పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకొని తిరుగుతున్న రొమేనియా దేశానికి చెందిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి మరోసారి దేశ వ్యాప్తంగా పోలీసు ప్రతిష్టను పెంచింది. ఆరు నెలలుగా దేశంలోకి చొరబడ్డ ఈ గ్యాంగ్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ను టార్గెట్ చేసింది. కార్డుల క్లోనింగ్‌లతో కోట్లాది రూపాయలకు స్కెచ్ వేసిన ముఠా బిజినెస్ వీసా మీద దేశంలోకి చొరబడ్డారు. వారి తెలివితేటలతో దేశంలోని దాదాపు 2040 మంది ఖాతాదారుల కార్డులను క్లోనింగ్ చేశారు. వీటిలో 550 మంది ఖాతాదారుల ఖాతాల నుంచి నగదును దోచుకున్నారు. ఇలా దోచుకున్న నగదును నిందితులు రొమేనియాకు వెస్టన్ యూనియన్ బ్యాంక్, ఈ వాలెట్స్ ద్వారా తిరిగి వారి దేశానికి పంపారు. విమానాల్లోనే చక్కర్లు కొట్టిన ఈ ముఠా స్టార్ హోటళ్లల్లో బస చేస్తూ క్యాబ్‌లలో తిరుగుతూ కేవలం సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాలను పసిగట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా వారి ముఖకవలికలు బయటికి తెలియకుండా ఉండేందుకు టోపీతో కలిసి ఉన్న మాస్క్‌లను ధరించింది. భారత దేశంలో ఇలాంటి మోసాలకు పాల్పడి తిరిగి వారి దేశానికి వెళ్లిన ఓ ముఠా ఇచ్చి న సలహాతో తాజాగా రొమేనియాకు చెందిన గ్యాబ్రియల్ ముఠా 2017 డిసెంబర్‌లో దేశంలోకి చొరబడింది. వారం రోజుల్లో తిరిగి సొంత దేశానికి వెళ్లిపోయేందుకు రెడీ అయినా ఈ ముఠాను అత్యంత చాకచక్యం గా మాటు వేసి అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పేరొందారు. అదే విధంగా రొమేనియా దేశ ఎంబసీ ఉన్నతాధికారులు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తును ఆరా తీశారు. దీంతో వారికి కూడా సైబరాబాద్ పోలీసుల స్మార్ట్ పోలీసింగ్ గురించి తెలిసింది.

ఏటీఎంలలో చైనా స్కిమ్మర్లు
యూకె, ఐరోపా దేశాల్లో జరుగుతున్న బ్యాంక్ కార్డుల క్లోనింగ్, స్కిమ్మర్ల ద్వారా జరుగుతున్న మోసాలపై రొమేనియాకు చెందిన గ్యాబ్రియల్ ఆకర్షితుడయ్యాడు. ఇదే ైస్టెల్‌లో ఇండియాలో మోసాలకు పాల్పడి స్వదేశానికి తిరిగి వచ్చిన ఓ బృందంతో గ్యాబ్రియల్‌కు పరిచయం ఏర్పడింది. వారు ఇండియాలో ఈ మోసానికి పాల్పడ్డా తమ ను ఎవరు పట్టుకోలేదని చెప్పడంతో గ్యాబ్రియల్ ఇండియాలో ఇలాంటి మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిని తన స్నేహితులైన అలెగ్జాండర్ మిహాయి, కాస్టినెల్, మారియన్‌ను ఓ ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. కార్డు క్లోనింగ్‌పై అవగాహన కలిగించి మొదట యూకె, రొమేనియాలో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత 2017 డిసెంబర్‌లో బిజినెస్ వీ సా మీద ఈ ఐదుగురు ఇండియాకు వచ్చారు. చైనాకు చెందిన అలీబాబా వెబ్‌సైట్ ద్వారా స్కిమ్మర్లను కొనుగోలు చేసి వాటి ద్వారా కార్డులను క్లోనింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

సిటీలోని 4 ఏటీఎంలలో రహస్య కెమెరాలు
గ్యాబ్రియల్ అలీబాబా వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసిన స్కిమ్మర్లను నగరానికి తీసుకువచ్చి కూకట్‌పల్లి, విజయ్‌నగర్ కాలనీ, జూబ్లీహిల్స్, ప్రగతినగర్ కాలనీల్లోని సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎంలలో పెట్టాడు. దీని కోసం ఆ చుట్టు పరిసరా ల్లో ఉన్న రాడిసన్ బ్లూ, మాదాపూర్ నొవాటెల్ హోటల్, స్వాగత్ హోటల్‌లో బస చేశారు. తెల్లవారుజామున క్యాబ్ బుక్ చేసుకుని ఏటీఎం కేంద్రాలకు వెళ్తా రు. అక్కడ చిప్‌తో కూడిన స్కిమ్మర్‌ను .. కార్డును ఇన్‌సర్ట్ చేసే మార్గానికి బిగిస్తా డు. రహస్య కెమెరాను కీ బోర్డుకు పైన స్టిక్కర్‌తో అంటిస్తాడు. ఆ మరుసటి రోజు వచ్చి వాటిని తీసుకుపోయి వాటిని ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేసుకుని చిప్‌లో నిక్షిప్తమైన డాటాను బయటికి తీస్తారు. వాటి ద్వారా కార్డులను క్లోనింగ్ చేస్తాడు. సీసీ కెమెరాల్లో రికాైర్డెన లావాదేవీల పిన్ నెంబర్లను సేకరించి వాటికి అ నుగుణంగా కార్డులను క్లోనింగ్ చేసి వాటి కి ప్రత్యేక నెంబర్లను క్రోడీకరించి వాటి ద్వారా నగదును డ్రా చేస్తున్నారు. ఇలా గ్యాబ్రియల్ ముఠా సైబరాబాద్ పరిధికి చెందిన 48 మంది బ్యాంక్ ఖాతాదారు ల నగదును ఎత్తుకెళ్లిపోయారు.

క్లోనింగ్ కార్డుల కోసం వందల్లో టీ షర్టులు కొనుగోలు
గ్యాబ్రియల్ క్లోనింగ్ చేసేందుకు అవసరమయ్యే మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తో కూడిన కార్డు ల కోసం ముంబైలో హెచ్‌ఎమ్ సంస్థకు చెందిన వస్తువులను కోనుగోలు చేశాడు. దీని కోసం ఓ సందర్భంగా ఒకేసారి 30 టీ షర్టులను ఖరీదు చేసి మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులను పొందాడు. ఇలా పొందిన మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల్లో స్కిమ్మర్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అందులోకి మార్చి వాటి ద్వారా నగదును ముంబైలోని ఏటీఎంలలో డ్రా చేస్తూ ప్రతిరోజు రూ.5వేల నుంచి రూ.1.40 లక్షల వరకు నగదును కొల్లగొట్టారు. అదే విధంగా సీసీ కెమెరాల్లో రికాైర్డెన పిన్ నెంబర్‌ల ఆధారంగా క్లోనింగ్ కా ర్డులతో నగదును ముఠా ఈజీగా కొల్లగొట్టింది. ఈ ముఠా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్, ఇతర సంస్థల కార్డుల ఆఫర్లను అ నుకూలంగా మార్చుకుని వేలాది మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులను ఎవరికీ అనుమానం రాకుండా పొందింది. ఇలా గ్యాబ్రియల్ ముఠా మొత్తం ఆరు నెలల్లో 2040 కార్డులను తయారు చేసి అందులో 550 కార్డులను ఉపయోగించి లక్షలాది రూపాయలను డ్రా చేసింది.

774
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles