సైదాచారి మృతి సాహితీ రంగానికి తీరని లోటు


Wed,May 16, 2018 12:31 AM

-సంస్మరణ సభలో పలువురు వక్తలు
బషీర్‌బాగ్: అయిల సైదాచారి మృతి సాహితీ రంగానికి తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. ఆయన చేసిన రచనలు భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయని వారు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ కవి, రచయిత అయిల సైదాచారి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా సైదాచారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మశ్రీ ఎక్కా యాదగిరిరావు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ డైరెక్టర్ జీవీ.సుబ్బారావు, ప్రముఖ కవి, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, నాళేశ్వరం శంకరం మాట్లాడారు. సైదాచారి చేసిన రచనలు భావితరాలకు ఉపయోగపడుతాయన్నారు. ఆయన మృతి కవులు, రచయితలకు తీరనిలోటని అన్నారు. గొప్ప కవి, రచయితగా రాణించడం అభినందనీయమని కొనియాడారు. సమావేశంలో కవులు, రచయితలు జగన్‌రెడ్డి, విమల, పగడాల నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

369
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...