అపర భగీరథుడు సీఎం కేసీఆర్


Sat,April 21, 2018 12:51 AM

-రిజర్వాయర్ల ప్రారంభోత్సవంలో ఎంపీ మల్లారెడ్డి
-నాలుగుచోట్ల ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
అడుగడుగునా స్థానికుల నీరాజనాలు
జీడిమెట్ల : మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ మహిళల నీటి కష్టాలు తీర్చిన అపరభగీరథుడని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ళ పరిధిలో 220కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఆరు మంచినీటి రిజర్వాయర్లలో నాలుగు మిషన్ భగీరథ పథకం మంచినీటి రిజర్వాయర్లను వారు ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో, పూర్ణకుంభాలతో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లకు స్వాగతం పలికారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట(7ఎంఎల్), రామిరెడ్డినగర్ ఐడీఏ(5ఎంఎల్), సూరారం కాలనీ, రాజీవ్‌గృహకల్ప(7ఎంఎల్), ఎన్‌సీఎల్ గంగాఎన్‌క్లేవ్‌లో నల్లాల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐడీపీఎల్ చౌరస్తా నుండి జగద్గిరిగుట్ట, పైప్‌లైన్ రోడ్డు, షాపూర్‌నగర్, జీడిమెట్ల పారిశ్రామికవాడ, సూరారం కాలనీల మీదుగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సుభాష్‌నగర్ డివిజన్ సూరారం కాలనీ శ్రీరాంలీలామైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ 30సంవత్సరాలలో కుత్బుల్లాపూర్‌లో జరగని అభివృద్ధిపనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కరెంటు కోతలు లేకుండా 24గంటల విద్యుత్ సరఫరా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి కుత్బుల్లాపూర్‌కు 220కోట్లు కేటాయించి ఆరు మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇంటింటికి నల్లా కనెక్షన్‌తో పాటు రోజువిడిచి రోజు మంచినీటిని సరఫరా చేసుకునేందుకు నాలుగు రిజర్వాయర్లను ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల దమ్ము, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని, 2019 సాధారణ ఎన్నికల వరకు ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీటిని ఇవ్వకుంటే ఎన్నికల్లో ఓట్లడగమని సవాల్ విసిరిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దేశంలో ఉన్న నాయకులలో అత్యంత ధైర్యవంతుడని అన్నారు. ఐదువేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను డిసెంబర్ నాటికి నిరుపేదలకు అందజేస్తామన్నారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులే మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్‌లోని ఎనిమిది డివిజన్లలో నాలుగు రిజర్వాయర్లను ప్రారంభించుకోవడం శుభపరిణామమని అన్నారు. ఐటీ, పురపాలకశాఖామంత్రి కేటీఆర్ సహకారంతో మిషన్ హైదరాబాద్ కింద రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.500కోట్లు కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాలను రెండు, మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద రెండువేల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. రెసిడెన్షియల్ సూళ్ళలో 1500మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీవైస్‌చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు కేఎం ప్రతాప్, శ్రీశైలంయాదవ్, ఎంపీపీ సన్న కవితశ్రీశైలంయాదవ్, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్, సుభాష్‌నగర్, సూరారం డివిజన్ల కార్పొరేటర్లు కొలుకుల జగన్, బి విజయశేఖర్‌గౌడ్, దేవగారి శాంతిశ్రీరాజేందర్‌రెడ్డి, మంత్రి సత్యనారాయణ, సుభాష్‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు దేవగారి రాజేందర్‌రెడ్డి, చింతల్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మహ్మద్ఫ్రీ, కుత్బుల్లాపూర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేయం గౌరీష్, టీఆర్‌ఎస్ నాయకులు జెమ్మి దేవేందర్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ ఆగం రాజు, జలమండలి అధికారులు సుబ్రమణ్యం, శివరాజ్‌గౌడ్, శ్రీధర్, రాజు, భాస్కర్, శ్రీనివాస్‌రావు, ఏరియా, వార్డుకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

767
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...