చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించండి


Sat,April 21, 2018 12:45 AM

సిటీబ్యూరో: నగర సమగ్రాభివృద్ధి కోసం బల్దియా ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వివిధ విభాగాల అధిపతులను ఆదేశించారు. పనులు పూర్తయ్యేవరకు ప్రత్యేక శ్రద్ధ్దతో బాధ్యత వహించాలని వారు కోరారు. అంతేకాకుండా చేపట్టిన పనులు గడువులోగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మేయర్‌తో పాటు ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆదాయ-వ్యయ వివరాలు, పార్కుల్లో పచ్చదనం పునరుద్ధరణ, పార్కుల చుట్టూ సీసీ జాలీల మార్పు, జీహెచ్‌ఎంసీ ట్విట్టర్ ఖాతా సమీక్ష, ఇంటి అనుమతులు, ఫైర్‌సేఫ్టీ, రెస్టారెంట్లు/పబ్బుల్లో ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు, అత్యవసర ద్వారాలు, పట్టణాభివృద్ధి శాఖకు 50 హోర్డింగులు, పన్నుల వసూళ్లు, డెబ్రిస్ తొలిగింపు, గడువు మీరుతున్న ఇంటి అనుమతులు(డీపీఎంఎస్), చెరువుల శుద్ధి కార్య ప్రణాళిక, వర్టికల్ గ్రీన్ గార్డెన్, నర్సరీల అభివృద్ధి (సోషల్ ఫారెస్ట్) తదితర అంశాల పురోగతిని తెలుసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖాళీ జాగాల్లో మొక్కలు నాటాలని, ఖాళీ జాగాలను పరిరక్షించాలని వారు కోరారు. ైఫ్లెఓవర్ల కింద వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్‌లో సైతం భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేయాలని స్పష్టంచేశారు.

28,30న ఎల్‌ఆర్‌ఎస్ మేళాలు...
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఈనెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని స్పష్టం చేశారు. దీనికోసం ఈనెల 28, 30తేదీల్లో అన్ని జోన్లలో ఎల్‌ఆర్‌ఎస్ మేళాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
రోడ్డు మరమ్మతు పనుల పరిశీలన....
మేయర్ రామ్మోహన్, అరవింద్‌కుమార్ రాత్రి 12గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నెం-5,7లతోపాటు నల్లగండ్ల ైఫ్లెఓవర్, మసీద్‌బండ తదితర రోడ్ల మరమ్మలు పనులను పరిశీలించారు.

382
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...