ఆర్టీసీ కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు


Sat,April 21, 2018 12:44 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: టీఎస్‌ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు తార్నాక ఆర్టీసీ దవాఖానలో మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం దవాఖానను సందర్శించిన ఆయన కార్మికులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. దవాఖానలోని ఓపీ, ఎక్స్‌రే, ఫార్మసీ, స్కానింగ్, బ్లడ్‌శాంపిల్‌రూం. ల్యాబ్ సెంటర్, ఇసిజీ విభాగాలను పరిశీలించడంతోపాటు పేషంట్లకు అందుతున్న వైద్యసేవలను అడిగితెలుసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆర్టీసీ చిత్త శుద్ధితో ఉందన్నారు. పేషంట్ల రోగ నిర్ధారణ, మందులు తీసుకునే సమయంలో ఎక్కువసేపు రోగులను నిరీక్షించుకోకుండా అందుకు తగిన విధంగా మార్పులు చేర్పులు చేయాలని ఆదే శించారు. డాక్టర్ రాసిన మందుల పంపిణీ కౌంటర్లను పెంచాల్సి ఉందంటూ ఆన్‌లైన్ ప్రాసెస్ విధానాన్ని సరళతరం చేయాలని ఐటీ విభాగం వారికి సూచించారు. చైర్మన్ వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, దవాఖాన సీఎంఓ మమతనారియన్, సీనియర్ పౌరసంబంధాల అధికారి కిరణ్, డాక్టర్లు తదితరులు ఉన్నారు

380
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...