హైదరాబాద్ టూ లండన్


Thu,April 19, 2018 11:46 PM

అమీర్‌పేట్ (నమస్తే తెలంగాణ):ప్రపంచమంతాఒకే కు టుంబం... వసుదైవ కుటుంబం అనే సందేశాన్ని విశ్వ వ్యాప్తం చే స్తూ నగరానికి చెందిన డాక్టర్ జీవి ప్రసాద్ ఇప్పటికే ప్రపంచ పర్యటనలు చేస్తూ ఇప్పటికే 96,697 కి.మీల దూరాన్ని చుట్టి వచ్చారు. తాజాగా సిల్క్ రూట్‌లో మరో సాహసోపేతమైన యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న నగరం నుండి 17వేల కి.మీల దూరాన్ని చుట్టివచ్చే విధంగా తన యాత్ర ప్రణాళికను రూపొందించుకున్నారు. హైదరాబాద్ నుండి లండన్‌కు తన మోటర్ బైక్ మీద ఈ పర్యటనను చేపట్టనున్నా రు. నగరానికి చెందిన పాత్ కేర్ ల్యాబ్స్ సీఎండి జీ.వీ.ప్రసాద్ (56), వైద్య విద్యను అభ్యసిస్తున్న తన కుమారుడు రక్షిత్ (23)తో కలిసి ఈ పర్యటనను చేప ట్టనున్నారు. 24న ఉదయం 5 గంటలకు షామీర్‌పేట్ నుండి తన పర్యటనను ప్రారంభించనున్న డాక్టర్ జీ.వీ.ప్రసాద్ మొత్తం 17 వేల కి.మీల దూరాన్ని 55 రోజుల్లో పూర్తి చేయ నున్నారు. నగరం నుండి మొదలై వైజాగ్, అస్సాంలోని గౌహ తిల మీదుగా దేశాన్ని దాటి భూటాన్, మ యన్మార్, చైనా.. ఇలా రెండు ఖండాలు, 16 దేశాలు దాటి లండన్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో బీఎండబ్ల్యు బైక్‌లను వినియోగించనున్నారు. 10 అత్యుత్తమ బైక్‌లు కలిగి ఉన్న డాక్టర్ ప్రసాద్ హార్లీ డేవిడ్‌సన్ క్లబ్‌లో యాక్టివ్ మెంబర్‌గా కూడా కొన సాగుతున్నారు. డాక్టర్ ప్రసాద్ తన భార్య నందిని ప్రసా ద్, కుమారుడు రక్షిత్‌తో కలిసి గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.

649
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...