బల్దియాలో..యు ఆర్ ఇంటర్‌డిపెండెంట్


Thu,April 19, 2018 11:44 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ కమిషనర్ మరో వినూత్న ప్రయోగానికి తెరలేపారు. అధికారులు, ఉద్యోగులు ఎటువంటి తారతమ్యాలకు తావులేకుండా పరస్పరం కలిసిమెలిసి పనిచేయాలని కోరుతూ దీనికి సూచికగా మీరు పరస్పరాధారితులు(యు ఆర్ ఇంటర్‌డిపెండెంట్) అని పేర్కొనే స్టిక్కర్లను ముద్రించారు. అన్ని కార్యాలయాల్లో వీటిని అంటించాలని, ఉద్యోగులంతా ఈ పద్ధతిని పాటించాలని ఆయన కోరారు. ఇటీవల జీహెచ్‌ఎంసీలో జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి వారికి కీలక విభాగాలు అప్పగించడంతో సీనియర్ నాన్ ఐఏఎస్ అధికారులు వారికింద పనిచేసేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అంతా సమానులే, అంతా కలిసిమెలిసి పనిచేయాలని సూచిస్తూ కమిషనర్ ఇలా స్టిక్కర్లను ముద్రించి కార్యాలయాల్లో అంటించాలని కోరారు. గతంలో సైతం వివిధ సందర్భాల్లో కమిషనర్ ఇదే తరహాలో యాక్ట్ నౌ, స్వల్ప పొరపాటుకు కన్ను బలి తదితర అంశాలతో స్టిక్కర్లు ముద్రించి కార్యాలయాల్లో వాటిని ఏర్పాటుచేశారు.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...
Namasthe Telangana Property Show

Featured Articles

మరిన్ని వార్తలు...