ట్రావెల్ 24 ఆర్టీసీ టికెట్లకు భారీ స్పందన


Thu,April 19, 2018 11:42 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జంట నగరాల పరిధిలో 24 గంటలపాటు ఒకే టికెట్‌పై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తున్న టీఎస్‌ఆర్టీసీకీ మంచి స్పందన లభించింది. ట్రావెల్ 24 పేరుతో ప్రయాణికులకు పరిచయం చేసిన టికెట్‌ను వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చుతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-18 లో వీటి వినియోగం పెరిగింది. ఈ విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి టీఎస్‌ఆర్టీసీ విడిపోయాక కొన్ని సంస్కరణలు చేసి తెలంగాణ ప్రభుత్వం సలహాతో ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతమైనది. నాన్ ఏసీ బస్సుల్లో 24 గంటల ప్రయాణానికి టారీఫ్‌ను రూ.80గా నిర్ణయించారు. ఏసీ బస్సుల విషయానికి వస్తే రూ.160గా ఖరారు చేసి టీఏవైఎల్ టికెట్ పేరుమీద బస్సుల్లోనే కండక్టర్లు టికెట్లు జారీచేశారు. వీటిపై పెద్ద ఎత్తున అధికారులు సిటీ బస్సులు, బస్‌స్టేషన్లలో ప్రచారం చేపట్టారు. అదేవిధంగా గేట్ మీటింగులు నిర్వహించి కండక్టర్లకు అవగాహన కల్పించి ప్రోత్సహకాలు ఇచ్చారు. విక్రయాలు పెంచడానికి 5 టికెట్లలోపు అమ్మకాలకు ఒక్కో టికెట్‌పై 50 పైసలు, 5 టికెట్లకు మించి అమ్మితే ఒక్కో టికెట్‌పై రూ.1 కమీషన్ ఇచ్చారు. దీంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అయితే నెలలో 125కు మించి టికెట్లు అమ్మిన కండక్టర్లలో ఉత్తమమైన వారిని ఎంపికచేసి మొదటి అవార్డు క్రింద రూ.300, రెండో అవార్డు క్రింద రూ.250, మూడో అవార్డు క్రింద రూ.200 అందచేస్తామని ప్రకటించారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...