లైబ్రరీల మరమ్మతులకు చర్యలు


Thu,April 19, 2018 01:28 AM

-పెండ్లికి ఒప్పుకోకపోతే నిర్బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు
కంటోన్మెంట్, (నమస్తే తెలంగాణ): భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింట్లో ఉంటున్నా.. అదే గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి పెండ్లి చేసుకోవాలని కోరగా ఒప్పుకోకపోవడంతో.. తన కూతురిని అపహరించి... లొంగదీసుకుని లైంగికదా డికి పాల్పడ్డాడు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరుగలేదు. దీంతో హైకోర్డు న్యాయవాది నాగమణితో కలిసి బాధిత మహిళ జూకాని సరిత బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో తన బాధను వెల్లడించింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం, గోపాల్‌పూర్‌కు చెందిన నాకు మహాదేవ్‌పూర్‌కు చెందిన రమేశ్‌తో వివాహమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆరేండ్ల క్రితం భర్త మృతి చెందడంతో తల్లిగారింట్లో ఉంటున్నా. అదే గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి సుంకరి ప్రతాప్(48) భార్య చనిపోవడంతో తనను పెండ్లి చేసుకోవాలని కోరగా తిరస్కరించాను. దీంతో తన చిన్న కూతురు (5)ను బలవంతంగా కారులో ఎక్కించుకుని... నీవు రాకపోతే నీ కూతురిని చంపుతానని బెదిరించాడు. ఆం దోళనకు గురైన తను కారులో కూర్చున్నా...పెండ్లి చేసుకుందామని కొండగట్టుకు తీసుకెళ్లి ఓ గదిలో బం ధించి తనపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడు రోజుల అ నంతరం వేములవాడకు, అనంతరం ధర్మపురికి, ఆనంతరం భద్రాచలంకు తీసుకెళ్లి తనపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడని వాపోయింది. గత నెల మార్చి8న గోదావరిఖనిలోని అతని స్నేహితుడి ఇంట్లో ఉంచి.. మ ళ్లీ వస్తానని వెళ్లి తిరిగి రాలేదు. అక్కడి నుంచి గోపాల్‌పూర్ వెళ్లి ప్రతాప్‌ను నిలదీయగా.. అతని కుమారులు ఇంట్లో బంధించి బెదిరించారు. ఈ విషయంపై మార్చి 17న మంథని ఎస్సై ఉపేంద్రరావుకు ఫిర్యాదు చేస్తే... ప్రతాప్‌తో సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడని .. ఆ తర్వాత వచ్చిన ఎస్‌ఐను కలిసినా అతను అదే మాట చెప్పాడని తెలిపింది. ఇదే విషయమై ఏసీపీ రక్షితను కలిసినా ఆమె కూడా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైన ప్రతాప్‌తోపాటు సుంకరి కిషోర్, కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలా ఉండగా.. ఆ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు బాధిత మహిళ తెలిపింది.

415
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...