రూపాయి నల్లా కనెక్షన్ మరింత సులువు


Wed,April 18, 2018 02:52 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చే ప్రక్రియను జలమండలి మరింత సులభతరం చేసింది. పేదలకు నల్లాల ద్వారా సమృద్ధిగా నీరందించే ప్రక్రియలో భా గంగా దారిద్య్రరేఖకు దిగువనున్న గృహాలకు ఒక్క రూపాయి కి నల్లా కనెక్షన్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ముందుకొచ్చిన పేదలకు మాత్రమే ఈ నల్లా కనెక్షన్‌ను మంజూరు చేస్తున్నారు. ఇక నుంచి బస్తీల్లోని అర్హులను స్వయంగా గుర్తించి వారికి ఈ పథకం ఫలాలు అందించాలని ఎండీ దానకిశోర్ నిర్ణయించారు. ఈ మేరకు సంస్థ పరిధిలోని బస్తీలకు నేరుగా వెళ్లి స్వయంగా అర్హులను గుర్తించడం, వారి నుంచి రూపాయి నల్లా కనెక్షన్‌కు కావాల్సిన అఫిడవిట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డులను తీసుకుని సంస్థ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెంటర్ ద్వారా సంబంధిత నల్లా కనెక్షన్ ఆన్‌లైన్‌లోనే జలమండలి సిబ్బందియే దరఖాస్తు చేయనున్నారు. ఈ మేరకు బస్తీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జీహెచ్‌ఎంసీ స్వయం సహాయక బృం దాల సహకారం తీసుకోనున్నారు. ఇందులో భాగంగానే నేడు కుత్బుల్లాపూర్‌లోని స్వయం సహాయక బృందాల సభ్యులకు ఒక్క రూపాయ నల్లా కనెక్షన్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. బస్తీల్లోని గృహాల యాజమానుల దగ్గరికి వెళ్లి ఒక్క రూపాయి పథకాన్ని వివరించడంతో పాటు ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని 27 బస్తీల్లో గుర్తించిన దాదాపు 10వేల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మధ్య వ్యక్తుల ప్రమేయానికి శాశ్వత చెక్ పెడుతూ బస్తీల పర్యటన చేసి అర్హులకు ఈ నల్లా కనెక్షన్ పొందేలా ఎండీ దానకిశోర్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

432
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...