దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


Mon,April 16, 2018 11:46 PM

దుండిగల్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : దళితుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌పార్టీ యువజన విభాగం రాష్ట అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. గండిమైసమ్మ-దుండిగల్ మండలం, మల్లంపేట గ్రామ పరిధిలో ఎస్సీకమ్యూనిటీహాల్(అంబేద్కర్) నిర్మాణానికి సహకరించాల్సిందిగా గ్రామసర్పంచ్ అర్కలఅనంతస్వామి ఆధ్వర్యంలో పలువురు నేతలు సోమవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును ఆయన కార్యాలయంలో కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞప్తిచేశారు. వెంటనే స్పందించిన ఆయన తనకోటా నిధుల నుండి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు అందుకు సంబందించిన ఉత్తరాన్ని అందజేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న విషయాన్ని వివరించారు. తానుసైతం దళితుల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. దీంతో సర్పంచ్‌సహా నేతలంతా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

రవాణా సౌకర్యం మెరుగుపర్చండి...
అనంతరం సర్పంచ్ అనంతస్వామి ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు మరో వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం, శంభీపూర్ గ్రామాల నుండి నగరానికి తగిన రవాణాసౌకర్యం లేనికారణంగా ఆయాగ్రామాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా 287 ఎక్స్, నంబర్ ఆర్టీసీ బస్సును నిజాంపేట చౌరస్తానుండి మల్లంపేట మీదుగా భౌరంపేట వరకు నడుపాలనీ, 224జీ బస్సుసర్వీసును ప్రస్తుతం మియాపూర్ నుండి గండిమైసమ్మ చౌరస్తావరకు నడిపిస్తున్నారని అయితే అట్టి బస్సు సర్వీస్‌ను మల్లంపేట్, మహేశ్వరం, శంభీపూర్, భౌరంపేట మీదుగా గండిమైసమ్మ చౌరస్తా వరకు నడుపాలని కోరారు. అదే విధంగా 272 బస్సు భౌరంపేట వరకే వస్తుందని దానిని మల్లంపేట మీదుగా బాచుపల్లి చౌరస్తా వరకు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ రాజు ఈ విషయంలో సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు.

286
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...