సర్వే క్షమాపణ చెప్పాలి


Mon,April 16, 2018 11:46 PM

మేడ్చల్ కలెక్టరేట్ : గత 14వ తేదీన కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డిని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వ్యక్తిగతంగా దూషించడం అప్రజాస్వామికమని జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.సురేశ్‌మోహన్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను దూషించినందుకు గాను జిల్లా, టీజీఓ, టీజీఓ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్‌పల్లిలో జరిగిన అంబేద్కర్ జయంతికి సర్వే సత్యనారాయణను ప్రత్యేకంగా ఆహానించేందుకు గాను ప్రొటోకాల్ తమకు లేదని, ఓ కేంద్ర మంత్రిగా పని చేసిన సర్వే జిల్లా ఉన్నతాధికారిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఎన్నికలు మరో 6 నెలల్లో రానున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. కలెక్టర్‌ను దూషించిన సర్వే సత్యనారాయణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అశంపై నేడు (మంగళవారం) జిల్లా ఉద్యోగుల రాష్ట్ర సీఎస్, డీజీపీ, రాచకొండ కమిషనర్‌లను కలిసి సర్వే సత్యనారాయణను అరెస్టు చేయాల్సిందిగా వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. కలెక్టర్ ఎంవీరెడ్డిని దూషించిన కేసులో న్యాయం జరిగేంత వరకు ఉద్యోగులమంతా పెన్‌డౌన్ చేస్తున్నట్లుగా సురేశ్‌మోహన్ ప్రకటించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతంకుమార్, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు పర్వతాలు, జిల్లా టీజీఓ అధ్యక్షుడు వినయ్‌కుమార్, టీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు బి.రవిప్రకాశ్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు ధనరాజ్ నాయక్, రాజు(వస్తాద్), వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

430
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...