ఆ క్లూలే.. పట్టించేశాయి


Mon,April 16, 2018 11:45 PM

-ఆరు మీటర్ల మేర రక్తం మరకలు
-మృతదేహం కింద కండోమ్
-దర్యాప్తులో కీలకంగా మారిన ఆధారాలివి
-రెండు అనుమానాస్పద మృతి కేసుల వెనుక ట్విస్టు లు
-హత్యలుగా ధ్రువీకరణ
-ప్రశంసలందుకున్న సైబరాబాద్ కాప్స్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైబరాబాద్‌లో ఇటీవల జరిగిన రెండు హత్య కేసుల దర్యాప్తు చాలా ఆసక్తికరం గా సాగాయి. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆత్మహత్యలుగా నమ్మించినా.. ఘటనా స్థలంలో దొరికిన చిన్న చిన్న క్లూలతో పోలీసులు వారి దర్యాప్తు కోణాలను మార్చుకున్నారు. ఈ రెండు అంశాలను కొద్ది రో జుల పాటు విశ్లేషించడంతో మరి కొన్ని కీలక ఆధారాలు లభించాయి. వాటిని సాంకేతిక పరంగా నిర్ధారించుకోవడంతో హత్యకు సూత్రధారులైనవారు నోరు విప్పాల్సి వచ్చింది. ఈ దర్యాప్తులో సీసీ కెమెరాలు ప్రధాన భూమి క పోషించినప్పటికీ.. అధికారుల ఇన్విస్టిగేషన్ ఐడియాలు కూడా దీనికి తోడై క్రిమినల్స్ తప్పించుకోకుండా చేసింది.
ఆ రెండు ఆధారాలు..
ఓ హత్య కేసులో మృతదేహం కింద కండోమ్.. మరో కేసులో ఆరు మీటర్ల వరకు రక్తపు చుక్కలు ఉండడంపై అనుమానించిన సైబరాబాద్ పోలీసులు విచారణలో వా టిని శాస్త్రీయంగా మ్యాపింగ్ చేసి అనుమానాస్పదంగా ఉన్న ఆ కేసుల మిస్టరీని నిగ్గు తేల్చారు. ఇలాంటి దర్యా ప్తు పద్ధతులను విశ్లేషిస్తే టీంలో ప్రతి అధికారి, సిబ్బంది ఆలోచనలు కీలకంగా మారి వాటికి అనుగుణంగా టెక్నాలజీ సహకారంతో విచారణను సాగించడం వల్ల చాలా కేసుల్లో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్‌లో జరిగిన రెండు కేసుల దర్యాప్తు స్థానికంగా పోలీసులకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

పోలీసుల దృష్టి మళ్లించేందుకు..
బోరబండ స్వరాజ్‌నగర్‌లో బీహార్ నుంచి వలస వచ్చిన మంగల్ దాస్, మాలతీదేవి నివాసముంటున్నారు. మం గల్‌దాస్ ప్రైవేట్ ఉద్యోగి. జనవరి 31న అతను అనుమానాస్పదంగా మృతి చెందాడు. సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం ఉన్న ఇంట్లో భార్య తప్ప మరెవరు లేరని, ఇది హత్య అయి ఉంటుందని డీసీపీ, ఏసీపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు సనత్‌నగర్ పోలీసులను రంగంలోకి దించారు. మృతదేహాన్ని పరిశీలిస్తుండగా దానికింద ఓ కండోమ్ పోలీసులకు కనపడింది. దీంతో ఇతర వివరాలను సేకరించారు. అనంతరం భార్య మాలతీ దేవిని ప్రశ్నించారు. ఆమె మంగల్ దాస్ సోదరుడు రాత్రి వచ్చాడని అని చెప్పి పోలీసుల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించింది. పోస్టుమార్టం నిర్వహించే వైద్యుల ప్రాథమిక షార్టు రిపోర్టును తీసుకున్నారు. మంగల్‌దాసును గొం తు నులిమి చంపారని తెలిసింది. దీంతో పాటు మంగల్ దాసు ఫోన్, భార్య మాలతీ దేవి ఫోన్‌లను విశ్లేషించారు. చివరకు మాలతీదేవిపై అనుమానం వచ్చి ఆధారాలను ఆమె ముందు పెట్టారు. ఇక తప్పించుకోలేనని మాలతీదేవి రూ. 12 వేలు ఇస్తాను వదిలేయండంటూ నోరు వి ప్పింది. ప్రియుడు నీరజ్‌కుమార్ మోజులో పడి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకున్నది. భర్తను చంపిన తర్వాత అక్కడే ప్రియుడితో శారీరకంగా కలిసి హత్యను తప్పుదోవ పట్టించేందుకు సూసైడ్ నోట్‌ను రాసినట్లు ఒప్పుకున్నది. ఇలా అధికారుల ఐడియాలకు ఆధారాలు దొరకడంతో భార్య కటకటాలకు వెళ్లింది.

మరో ఘటనలో.. సనత్‌నగర్ ప్రాంతంలో నివాసముంటున్న ఖాజా, సలేహా బేగం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల ఖాజా మృతదేహం రైలు పట్టాలపై పడి ఉండడంతో ఆ కేసును మొదట రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకుని 45 రోజుల తర్వాత సెక్షన్ 302(హత్య కేసు)కింద మార్చి సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో కొన్ని ఫొటోలను ఇచ్చారు. ఆ చిత్రాలను పరిశీలించినప్పుడు పోలీసులకు రైలు పట్టాల పక్కన ఆరు మీటర్ల వరకు రక్తపు చుక్కలు పడిన గుర్తులను పసిగట్టారు. వెంటనే అప్రమత్తమై మృతుడికి అయిన గాయాల స్వరూపాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఖాజా, అతని భార్యకు ఉన్న వయస్సు తేడాను పసిగట్టారు. వీటితో పాటు కాల్‌డేటా, టవర్ లొకేషన్, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని శోధించారు. తన భర్త కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ప్రాథమికంగా వచ్చిన ఆధారాలతో భార్య సలేహా బేగంను పోలీసులు నిలదీశారు. ఇంకేముంది మొత్తం హత్య చిట్టా బ యటపడింది. భార్య సలేహాబేగం ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని నిరూపించి ఆమెను, ప్రి యు డు తబ్రేజ్, కిరాయి హంతకులను అరెస్టు చేశారు.

319
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...