ప్లాస్టిక్‌ను పారదోలాలి..


Mon,April 16, 2018 05:43 AM

-జీహెచ్‌ఎంసీ ఉద్యోగులుదుకాణాలను దత్తత తీసుకోవాలి
-టిఫిన్ బాక్సులు ఉపయోగించేలా చూడాలి
-జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్‌లోని మటన్, చికెన్ దుకాణాల్లో టిఫిన్ బాక్స్‌లు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఆదివారం సూచించారు. నగరంలోని ప్రతి దుకాణాన్ని ఒక జీహెచ్‌ఎంసీ ఉద్యోగికి దత్తతగా అప్పగించాలలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ రూపొందించిన ఎజెండా విజయం సాధించేందుకు ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈసందర్భంగా కమిషనర్ 9 అంశాలతో కూడిన సూచనలు చేశారు. అవి..
-చికెన్, మటన్ దుకాణాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిం చేందుకు చర్యలు తీసుకోవాలి.
-కచ్చితంగా టిఫిన్ బాక్స్‌లు వినియోగించేలా జోనల్ కమిషనర్లు నిరంతర ప్రణాళికలు సిద్ధం చేయాలి.
-శానిటేషన్ విషయంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, శానిటరీ రిసోర్స్ పర్సన్లు, శానిటరీ జవాన్లను ప్రభావ వంతం గా ఉపయోగించుకోవాలి.
-మటన్, చికెన్ దుకాణాలను సందర్శించేందుకు ఎస్‌ఎఫ్‌ఏ, ఎస్‌ఆర్‌పీ, ఎస్‌జేలకు పూర్తి బాధ్యతలు అప్పగిం చి ప్లాస్టిక్‌ను నిషేధించాలి.
-ప్రతి ఆదివారం ఈ ఉద్యోగులకు ఒక్కో షాపును కేటాయించి విధులు పర్యవేక్షించాలి.
-మాంసం దుకాణాల్లో టిఫిన్ బాక్సులు ఉపయోగించాలని బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
-జీహెచ్‌ఎంసీ సూచించిన నిబంధనలను పాటించే విక్రయదారులకు షాపు యజమాని ప్రోత్సాహకాలు అందించేలా ఏర్పాట్లు చేయాలి.
-వినియోగదారుడికి టిఫిన్ బాక్సులు లేకపోతే ఆ షాపు యజమానే విక్రయించేలా, లేకుంటే అద్దె ప్రాతిపదికన అందించే విధంగా చూడాలి.
-ఇందులో భాగంగానే మాంసం దుకాణాలను దత్తత తీసుకునే జీహెచ్‌ఎంసీ సిబ్బందికి డ్రెస్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకొని ప్రజలను ఆకర్షించేలా విధులు నిర్వర్తించేలా చూడాలి.

457
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...