పిక్నిక్ స్పాట్‌లుగా 20 చెరువులు


Mon,April 16, 2018 05:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అర్బన్ లేక్స్ అండర్ మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా నగ రంలోని 20 చెరువులకు మహర్దశ పట్టనుంది. అభివృద్ధిలో భాగంగా పూడికతీత దగ్గర్నుంచి సుం దరీకరణ పనులతో పిక్నిక్ స్పాట్‌లుగా తీర్చిదిద్దేవరకు వివిధ రకాల ఏర్పాట్లు చేయనున్నారు. రూ. 282.63కోట్ల వ్యయంతో సున్నమ్‌కుంట చెరువు మినహా మిగిలిన 19చెరువుల అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం నిధులతోపాటు సాంకేతికపరమైన అనుమతులు మంజూరుచేసింది. దీంతో అధికారులు పనులకోసం టెండర్ల ప్రక్రియను చేపట్టారు. నెలాఖరులకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేలాది చెరువులను అభివృద్ధి చేసి సత్ఫలితాలను సాధించిన ప్రభుత్వం తాజాగా మిషన్ కాకతీయ-4వ దశలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పట్టణ చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 19 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.282.63కోట్ల నిధులతోపాటు సాంకేతిక అనుమతులను జారీ చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధులతో 19 చెరువులను సమగ్రంగా అభివృద్ధి చేయ నున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చెరువు/చెరువు కట్టల మరమ్మతులు, పూడికతీత పనులలతో పాటు మురుగునీటిని శుద్ధిచేసేందుకు ఎస్‌పీలు నిర్మించడం, పిల్లల ఆటలకు సం బంధించిన ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు, రీక్రియేషన్ సెంటర్లు, బోటింగ్, ఓపెన్ జిమ్ములు, పిక్‌నిక్ స్పాట్‌లు, ఇతర సుందరీకరణ పనులను చేపట్టనున్నారు. ఈ 19 చెరువులను అభివృద్ధి చేయ డం వలన నగర పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించే అవకాశముంది. వాస్తవానికి రూ. 287.97కోట్ల వ్యయంతో 20చెరువుల అభివృద్దికి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అందులో ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని సున్నంకుంట చెరువు మినహా మిగిలిన 19చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొన్ని సాంకేతికపరమైన అంశాల కారణంగా సున్నంకుంట చెరువుకు అనుమతులు రాలేదని, అయితే స్త్రుతం ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లు అధికారులు తెలిపారు. దానికి కూడా త్వరలోనే అనుమతులు రానున్నట్లు వారు భరోసా ఇచ్చారు.

534
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...