వాసవీ క్లబ్ సేవలు అమోఘం


Mon,April 16, 2018 05:36 AM

హిమాయత్‌నగర్ : సామాజిక సేవా రంగంలో వాసవీ క్లబ్ అందిస్తున్న సేవలు అమోఘమని మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. వాసవీ క్లబ్ హైదరాబాద్ 157వ అధ్యక్షుడిగా పొద్దుటూరి రాజేశ్వర్‌రావు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి నా రాయణగూడలోని కేశవ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడుతూ... సమాజంలోని ప్రజలు గౌరవంగా జీవించాలనే సంకల్పంతో వాసవీ క్లబ్ పేదలకు చేయూతనందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కా ర్యక్రమంలో వాసవీ క్లబ్ మాజీ అధ్యక్షుడు బూరుగు నర్సింహు లు, దయానంద్, రాగి ప్రకాశ్, కె.రఘువీర, బాశెట్టి గోపాల్, నాయకులు సురేశ్‌కుమార్, వర కుమార్‌గుప్తా, అంబరీష, వెంపటి మధు, దక్షిణామూర్తిలు పాల్గొన్నారు.

316
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...