రాజకీయాల్లో మహిళలకు పూర్తి భాగస్వామ్యం కల్పించాలి

Mon,April 16, 2018 05:35 AM

కవాడిగూడ, ఏప్రిల్ 15: దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు నేటికీ కొనసాగుతున్నాయని, మహిళ పట్ల పెరుగుతున్న వివక్షను రూపుమాపాలంటే విధానపరమైన నిర్ణయాల్లో, రాజకీయాల్లో పూర్తి భాగస్వామ్యం కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, సీనియర్ జర్నలిస్టు పద్మజషా అన్నారు. నగరంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ ఫెస్ట్ -2018లో భాగంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సబల వేదికపై ప్రసార సాధనాలు-మహిళలు అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పద్మజషా పాల్గొని మాట్లాడుతూ మహిళల పట్ల వివక్ష, దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. 1995 నుంచి మీడియా పూర్తిగా వ్యాపారంగా మారిపోయిందని, అందుకే ప్రజలకు ఉపయోగపడనివి కూడా కేవలం డబ్బు కోసం చూపిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మీడియాలో పని చేసే మహిళలు నేటికీ గుర్తింపు కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. మానవత్వ విలువల కోసం పోరాడే వారి పట్ల నిర్భందాలు పెరుగుతున్నాయని, మానవీయ విలువలను పూర్తిగా అంతం చేసే వ్యవహారం నేడు కొనసాగుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో మహిళలు కుటుంబం దగ్గర నుండి, ఇరుగు పొరుగు వాళ్ల వరకు తప్పును తప్పుగా వాదించాలని అప్పుడు మహిళలకు గుర్తిపు లభిస్తుందని సూచించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు అరుణ, ప్రసాద్ మూర్తి పాల్గొన్నారు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో
నవలకు ప్రత్యేక ఆదరణ ఉంది..
ఆధునిక తెలుగు సాహిత్యంలో నవలకు ప్రత్యేక ఆదరణ ఉందని, నవలా పాఠకులు ఎక్కువ ఉన్నారని ప్రముఖ నవలాకారులు పేర్కొన్నారు. హైదరాబాద్ ఫెస్ట్-2018 కార్యక్రమాల్లో భాగంగా సృజన స్వరం మఖ్దూం మొహియుద్దీన్ వేదిక పై ఆదివారం నవలా సాహిత్యంపై సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వి.శ్రీనివాస్‌రావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో చాలా మంది నవలాకారులు ఉన్నారని, నవలల పాఠకులు ఎక్కువగానే ఉన్నారని తెలిపారు. ప్రజలు సామాజిక జీవితాలను ప్రతిబింభించేలా వచ్చిన నవలలకు ఎంతో ఆదరణ లభిస్తుందన్నారు. నేటి కంప్యూటర్ కాలంలో పుస్తకాలకు, నవలలకు ఆదరణ తగ్గిందన్న భావన ఉంది కానీ, ఈ మధ్య కాలంలో పుస్తకాల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు తేల్చాయని సూచించారు. నవల వర్ణనతో కూడిన ప్రక్రియ అన్నారు. భారతదేశ రచయితలు ఇంగ్లిష్ భాషలో వేసిన నవలలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నవలాకారులు గుడిపాటి, కాలువ మల్లయ్య, శిరంశెట్టి కాంతారావు, వాహిద్ ఖాన్, ఆశారాజు, మోహన క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

తంగెళ్లపల్లి కవితాసంకలనం కుదుపు ఆవిష్కరణ
చిక్కడపల్లి:జర్నలిస్టులు సాహిత్యకారులైతే సమాజ వికాసానికి దోహదపడే సాహిత్యం వస్తుందని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు డా.అయాచితం శ్రీధర్ అన్నారు. కవిత్వం ఎప్పుడు గాఢంగా ఉండాలని, ప్రజల జీవితాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ సమాజంలో మంచి కవులున్నారని, తెలంగాణ వికాసానికి దోహదపడే మరింత మంచి కవిత్వాన్ని తంగెళ్లపల్లి భవిష్యత్‌లో కూడా రాయాలని ఆయన ఆకాంక్షించారు.
చిక్కడపల్లిలోని శ్రీవట్టికోట ఆళ్వారు స్వామి నగర కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం కామన్‌డయాస్ సంస్థ ఆధ్వర్యంలో తంగెళ్లపల్లి కనకాచారి రాసిన కవితాసంకలనం కుదుపు ఆవిష్కరణ సభ జరిగింది. పుస్తకాన్ని డా.అయాచితం ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ఎం.వేదకుమార్, తెలంగాణ రచయిల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం ఓయూ తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య డా.మసనచెన్నప్ప, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ కె.ప్రసన్నారామ్మూర్తి, తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారి, శంకరం వేదిక అధ్యక్షులు వై.రాజేంద్రప్రసాద్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రశస్తి, ఏపీకి సంఘీభావం, వివిధ సామాజిక అంశాలపై కవులు కవితాగానం చేశారు.

తెలంగాణ ప్రేమికుడు ఫణి భార్గవ స్మృతిలో నాటక కళ -మాసపత్రిక సంపాదకుడు రవిశర్మకు బెస్ట్ జర్నలిస్టు పురస్కారాన్ని ఈ సందర్భంగా కామన్‌డయాస్ సంస్థ ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. తెలంగాణ ప్రశస్తి, ఏపీకి సంఘీభాం, పలు సామాజిక అంశాలపై 30 మంది కవులు కవితాగానం చేశారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారి కవిసమ్మేళనానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కామన్‌డయాస్ ప్రతినిధులు సమత, ఓరుగంటి రామకృష్ణ, శివప్రసాద్‌లు పాల్గొన్నారు. ఆచార్య డా.మసనచెన్నప్ప మాట్లాడుతూ.. కవి త్వం ఓ తపస్సు లాంటిదన్నారు. నేడు రాసేవాళ్ల సంఖ్య పెరుగుతున్నది కానీ చదివేవాళ్ల సంఖ్య తగ్గడం బాధాకరమన్నారు. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ నిరంతరం సాహిత్యాన్ని సృష్టించడం కవుల బాధ్యతని, తంగెళ్లపల్లిని అభినందించారు. కవి ఎప్పుడూ ప్రభుత్వ పక్షం ఉండకూడదని, కవి ప్రజల పక్షానే నిలువాలని సూచించారు. నోట్ల రద్దు ఇబ్బందులపై కవిత్వం తీసుకురావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ నేత ఎం.వేదకుమార్ మాట్లాడుతూ.. సా మాన్యుని వేదికగా కామన్‌డయాస్ సంస్థ ఎదుగుతున్న తీరు అభినందనీయమన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంక రం మాట్లాడుతూ.. దేశ ప్రజలను ఓ కుదుపు కుదిపిన నోట్ల రద్దుపై చారి రాసిన కుదుపు కవిత్వం పదునుగా ఉందన్నారు. కవితాసంకలనంలోంచి కవిత్వాన్ని చదివి ఆయన వినిపించారు.

421

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles