మలక్‌పేట..దేశ మార్కెట్లకే ఆదర్శం

Sun,April 15, 2018 01:04 AM

మలక్‌పేట: ఈ నామ్ మార్కెటింగ్‌లో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ దేశ మార్కెట్లకే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర అసిస్టెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మీదేవి అన్నారు. మలక్‌పేట మార్కెట్‌లో ఈ నామ్‌ను ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వార్షికోత్సవాలకు శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ల అనుసంధానాన్ని (ఈ నామ్) అంచెలంచెలుగా ప్రవేశ పెట్టిందని తెలిపారు. వ్యాపారస్థులను, రైతులను సమన్వయపరుస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కల్పించి, ఈ నామ్ ద్వారా మార్కెటింగ్ విధానాన్ని అమలు పరచిందని పేర్కొన్నారు. ఈ నామ్‌ను పూర్తిస్థాయిలో అమలుపరచి అత్యధికంగా మార్కెటింగ్‌చేసి అధిక లాభాలు గడించిన మార్కెట్‌గా మలక్‌పేట మార్కెట్ దేశంలోని అన్ని మార్కెట్లకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షాహిన్ అఫ్రోజ్, మార్కెట్ ఉప సంచాలకులు(ఎస్‌జీఎస్) అనంతయ్య మాట్లాడుతూ మాన్యువల్ వేయింగ్ (కాంటాలద్వారా తూకం) విధానం కాకుండా ఆన్‌లైన్ వేయింగ్ ఇంటిగ్రేషన్ విధానంతో తూకం వేయడంతో రైతులకు నష్టం జరగడం లేదన్నారు. ఈ నామ్ మార్కెటింగ్‌లో 1,65,000 మంది మిర్చి రైతులు పాల్గొంటున్నారని, రూ.53 కోట్ల లావాదేవీలు నిర్వహించటం జరిగిందని తెలిపారు. గతేడాది మార్కెట్‌కు రూ. 7కోట్ల 86 లక్షల ఆదాయం చేకూరగా, ఈ ఏడాది రూ.9 కోట్ల, 46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామానికి చెందిన మిర్చి రైతు సంజీవరెడ్డిని, మలక్‌పేట మార్కెట్‌లోని ట్రేడర్ దడువాయి కిష్టయ్య అండ్ సన్స్ నిర్వాహకుడు దడువాయి రాధాకృష్ణను అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్-1 కార్యదర్శి చంద్రశేఖర్, గ్రేడ్-3 కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, నరేందర్, మార్కెట్ చైర్మన్ షాహిన్ అఫ్రోజ్, వైస్ చైర్మన్ భువనేశ్వరి, డైరెక్టర్ దుగ్గు జగదీశ్‌కుమార్, ట్రేడర్లు, రైతులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

630

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles