నేడు ఉగాది


Sat,March 17, 2018 11:55 PM

జవహర్‌నగర్: ఉగాది పండుగను పురస్కరించుకుని జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాలాజీనగర్, అంబేద్కర్‌నగర్, మల్కారంలలోని అన్ని ఆలయాలు తెలుగు నూతన సంవత్సర స్వాగతానికి ముస్తాబయ్యాయి. ఆలయానికి వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలతో పాటు పలు కాలనీలలో కూడా వేద పండితులతో పంచాంగ శ్రవణం వినిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాలాజీనగర్ పాత బస్తీలో హనుమాన్ ఆలయం, శివాలయం, అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ మల్లికార్జున యాదవ సంఘం, బజరంగ్ కాలనీలోని మనుమాన్ దేవాలయం, సాయిబాబా ఆలయం, శ్రీరాంనగర్‌లోని రామాలయాలతో పాటు గౌడ సంఘం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గొల్లకురుమ సహకార సంఘం, ఆర్యవైశ్య సంఘం,దళత, బహుజన సంఘాలు, బీజేఆర్‌నగర్‌లోని జై గౌడ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం వినిపిస్తున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఉగాది పచ్చడి కోసం నూతన కుండలు, వేప పువ్వు, వేపాకు, మామిడి ఆకులు, మామిడి కాయలు, పూజా సామగ్రి మార్కెట్లో పెద్ద ఎత్తున బాలాజీనగర్ మార్కెట్ చౌరస్తా, అంబేద్కర్‌నగర్ మార్కెట్‌లలో పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతున్నాయి. వినియోగ దారుల సందడి కనిపించింది.

361
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...