హస్తినాపురి సమస్యలు పరిష్కరిస్తాం


Sat,March 17, 2018 11:53 PM

- రూ.48 లక్షలతో యూజీడీ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- యూజీడీ పనులు పూర్తయ్యాకే రోడ్డు పనులు చేపడుతాం: డీసీ
కాప్రా, మార్చి 17: కాప్రా డివిజన్ హస్తినాపురం కాలనీలో కాప్రా సర్కిల్ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ డాక్టర్ యాదగిరిరావు, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి శనివారం పాదయాత్ర చేశారు. కాలనీపరిధిలోని అన్ని వీధులను వారు కలియతిరిగారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను కాలనీవాసులు వారితో మొరపెట్టుకున్నారు. భూగర్భడ్రైనేజీ లేకపోవడంతో ఏళ్లతరబడి స్థానికంగా పడ్తున్న ఇబ్బందులను కార్పొరేటర్ స్వర్ణరాజు, కాలనీవాసులు డీసీకి వివరించారు. భూగర్భడ్రైనేజీపనులు మంజూరు చేయాలనీ, రోడ్డు పనులు చేపట్టాలనీ, నీటి సమస్యలు తీర్చాలని వారు డీసీని కోరారు. 189 ఇండ్లు ఉన్న హస్తినాపురం కాలనీ సమస్యలకు డీసీ సానుకూలంగా స్పందించారు. కాలనీలో భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టేందుకు రూ. 48 లక్షలు మంజూరు చేస్తున్నట్టు డీసీ యాదగిరిరావు కాలనీవాసుల హర్షధ్వానాల మద్య ప్రకటించారు. యూజీడీ పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈఈ దయాశారల్‌ను డీసీ ఆదేశించారు. టెండర్ ప్రక్రియను వెంటనే చేపట్టి, పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. యూజీడీ పనుల కోసం రోడ్లు తవ్వాల్సి ఉన్నందున, ఇప్పటికే మంజూరైన రూ.45లక్షలతో కొత్తగా చేపట్టే రోడ్డుపనులను యూజీడీపనులు పూర్తయ్యాకే చేపట్టాలని డీసీ అన్నారు. అనంతరం సాయిపురి కాలనీ, హెచ్‌ఎంటీ బేరింగ్స్‌కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలు తెల్సుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు తదితరులుఉ పాల్గొన్నారు.

316
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...