నిరుద్యోగుల ఉపాధికి బాటలు


Sat,March 17, 2018 11:46 PM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లా పరిధిలోని నిరుద్యోగులకు ఉపాధి బాటలను మెరుగుపర్చేందుకు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధితో పాటు వృత్తి శిక్షణకు సంబంధించిన వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గామీణాభివృద్ధి శాఖ, జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్తంగా రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను శనివారం అధికారికంగా ప్రకటించిన కలెక్టర్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకే (www.medchaljobs.com) ఈ సైట్‌ను రూపొందించడం జరిగిందన్నారు.

జిల్లా పరిధిలో అనేక పరిశ్రమలున్నాయని, జిల్లాలో ఆయా పరిశ్రమలలో పని చేసేందుకు అర్హతలున్న వారు చాలా మంది ఉన్నప్పటికీ వారికి సరైన మార్గనిర్దేశనం లేని కారణంగా ఉపాధి పొందలేకపోతున్నారన్నారు. ఆయా పరిశ్రమలలో ఉన్న ప్రైవేటు కొలువుల వివరాలను సేకరించి ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల అర్హతలను బట్టి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, అలాగే అర్హతల మేరకు శిక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిధిలోని నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హతల బట్టి వారివారి వివరాలను వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీపీవో సురేష్ మోహన్, డీఆర్డీఓ కౌటిల్య, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...