ఎల్‌ఈడీ వెలుగుల్లో..మనమే నం.


Sat,March 17, 2018 02:37 AM

-నాలుగు లక్షల లైట్లు అమర్చి చరిత్ర సృష్టించిన బల్దియా..
-భారీగా తగ్గిన విద్యుత్ బిల్లులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా సంప్రదాయక వీధి దీపాలను ఎల్‌ఈడీలుగా మార్చి జీహెచ్‌ఎంసీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గతేడాది జూలైలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు మరో కొద్ది కాలంలో పూర్తికానుంది. వీధిదీపాలు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 4,53,000 విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఈడీలను అమర్చడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గి బల్దియాకు ఏడాదికి రూ. 115.13కోట్ల బిల్లు ఆదా అవుతుంది. ఈ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఎల్‌ఈడీ లైట్ల కారణంగా రోడ్లపై వెలుతురు పెరిగి ప్రమాదాల సంఖ్య తగ్గిందని అధికారులు తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 4.53 లక్షల సంప్రదా యక వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే అతిపెద్ద ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో 2017 జూలైలో బల్బుల మార్పిడి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ఏడాది చివరినాటికి నగరంలోని అన్ని వీధి దీపాలను కేటీఆర్ జీహెచ్‌ఎంసీకీ లక్ష్యాన్ని నిర్ధారించారు. దీనికి అనుగుణంగా 4.53 లక్షల ఎల్‌ఈడీ లైట్లను అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటివరకు నాలుగు లక్షల సంప్రదాయ లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో మిగతా వాటిని అమర్చి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా ముందుగా వీధి లైట్ల స్థానంలో ఎల్‌ఈడీలను భిగించారు. ఆ నగరంలోని జీహెచ్‌ఎంసీకి చెందిన ఉద్యాన వనాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, శ్మశానవాటికల్లో ఎల్‌ఈడీ లైట్ల బిగింపు ప్రక్రియను చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ఎల్‌ఈడీ లైట్లు బిగించడంతో ఆయా వీధులు తెల్లటి కాంతితో మెరుస్తున్నాయి. అంతేకాకుండా రాత్రివేళల్లో ప్రమాదాలు కూడా తగ్గాయని చెప్తున్నారు.

ఏటా 115 కోట్లు ఆదా

రాజధానిలో మొత్తం 4.53 లక్షల ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం ద్వారా ఏడాదికి 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవనున్నది. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.115.13 కోట్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. దీంతోపాటు ఏటా వాతావరణంలోకి 1,29,719 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కూడా తగ్గనుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 4,00,022 ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. ఇందులో 18వాట్స్, 35 , 70, 110, 190 వాట్స్ సామర్థ్యం కలిగిన విద్యుత్ దీపాలు ఉన్నాయి. ప్రస్తుతం అమర్చిన ఎల్‌ఈడీ బల్బులతో రోజుకు 3,79,329 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతున్నది. యూనిట్‌కు రూ.7 చొప్పున రోజుకు మొత్తం రూ.26.3 లక్షలు ఆదా అవుతున్నది. ఈ లెక్కన మొత్తం 4.55 లక్షల ఎల్‌ఈడీ బల్బులను అమర్చితే ఏటా 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా జీహెచ్‌ఎంసీకి విద్యుత్ బిల్లుల నుంచి ఏడాదికి రూ.115.13 కోట్ల భారం తగ్గుతుంది. సంప్రదాయ విద్యుత్ దీపాల వాడకంతో జీహెచ్‌ఎంసీ నిర్వహణ బిల్లుల రూపంలో రూ.252.89 కోట్లు చెల్లిస్తున్నది. ఇప్పుడు ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో విద్యుత్ వినియోగ చార్జీలు రూ.105.38 కోట్లకు తగ్గనున్నది. అంటే ఏడాదికి విద్యుత్ వినియోగం 58.33 శాతం తగ్గుతుంది. ఈ మిగిలిన ఆదాయం మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ ఏడేండ్లపాటు ఈఈఎస్‌ఎల్ సంస్థకు చెల్లించనున్నది. ఏడేండ్లపాటు లైట్ల నిర్వహణ ఈఈఎస్‌ఎల్ చూసుకుంటుంది. ఎల్‌ఈడీ లైట్లను అమర్చినందుకు జీహెచ్‌ఎంసీకి ఏ విధమైన భారం పడటం లేదు. వీటి నిర్వహణకు ఆటోమెటిక్ స్విచ్‌లను వాడనున్నారు. ఇవి సూర్యకాంతి రాగానే ఆరిపోయి, చీకటి పడుతుండగా వెలిగేలా చేస్తాయి. 24,962 స్విచ్‌లకుగానూ ఇప్పటివరకు 15,363 అమర్చారు.

జీహెచ్‌ఎంసీ రికార్డు

దేశంలోని ప్రధాన నగరాల్లో పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే ప్రక్రియను చేపట్టిన అతిపెద్ద కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దక్షణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అత్యధికంగా రెండు లక్షల సంప్రదాయ విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చి ముందు వరుసలో ఉన్నది. ఏపీలోని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లక్ష ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. ఈ రెండు కార్పొరేషన్లు ఎల్‌ఈడీ లైట్లను అమర్చడానికి సంవత్సరం సమయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం రికార్డు స్థాయిలో పూర్తికానున్నది. గత ఏడాది జూన్‌లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జూలై రెండో వారంలో పనులు ప్రారంభించారు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే నాలుగు లక్షల ఎల్‌ఈడీలను అమర్చారు.

1604
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...