నగరంలో 100 చోట్ల వీఎంబీ బోర్డులు


Sat,March 17, 2018 02:35 AM

-ట్రాఫిక్ సూచనల కోసం ఏర్పాటు
-67 చోట్ల పనులు పూర్తి
-ట్రాఫిక్ సీసీసీ నుంచి
-ఎప్పటికప్పుడు అలర్ట్స్
-ఐటీఎంఎస్‌లో భాగంగా ఏర్పాటు
-డిస్‌ప్లేతో పాటు డిజిటల్
-పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వీఎంబీ(వేరియబుల్ మేసెజ్ బోర్డు)ల ఏర్పాటు నగర ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో చురుకుగా సా గుతుంది. ట్రాఫిక్ అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు పంపించడంతో పాటు నిబంధనలపై అవగాహన కల్పించే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఐటీఎంఎస్(ఇంటలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం)లో భాగంగా డిజిటల్ బోర్డులకు అత్యాధునిక సాంకేతికతను జోడించి వీఎంబీ బోర్డులను ఏర్పా టు చేస్తున్నారు. నగరంలో మొత్తం ప్రధాన రహదారులలో 100 బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 67 బోర్డుల ఏర్పాటు పూర్తయ్యింది. ఈ బోర్డుల ఏర్పాటుతో పాటు డిజిటల్ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. వీఎంబీ బోర్డులలో వివిధ రంగులతో కూడిన అక్షరాలు, బొమ్మలు డిస్‌ప్లే అవుతుం టాయి. గతంలో 17 డిజిటల్ బోర్డులను నగరంలో ఏర్పాటు చేశారు, ఇక్కడ కేవలం ఒకే రంగుతో అక్షరాలు మాత్రమే కన్పిస్తాయి. దీనిన అధునీకరించి మల్టీ కలర్‌తో కూడిన టెక్స్, బొమ్మలు వచ్చే విధంగా వీఎంబీలు పనిచేస్తాయి.

ఫలాన రూట్‌లో వెళ్లే వాహనదారులకు సూచన.. ఈ రూట్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది.. మీరు ప్రత్యామ్నాయ రూట్‌లో వెళ్లం డంటూ సూచనలు ఇస్తుంది. ఎవైనా ఈవెంట్లు, నగరానికి అతిథులు వచ్చిన సమయంలో, వీఐపీలు పర్యటించే సమ యం లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ సందర్భంగా వాహ నదారులకు ట్రాఫిక్ ఆంక్షల గూర్చి పోలీసులు ఇక్కడి నుంచే చేరవేస్తారు. వీఎంబీ బోర్డులకు, ట్రాఫిక్ సీసీసీలకు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో నగరం మొత్తం కావాల్సిన సమా చారం అయితే అన్ని బోర్డులలో డిస్‌ప్లే అవుతుంది. డిజిటల్ పబ్లిక్ అనౌన్స్‌మెంట్‌ల నుంచి కూడా ట్రాఫిక్ రద్దీ విషయాన్ని ట్రాఫిక్ సీసీసీ నుంచి చేరవేస్తారు. ప్రధాన కూడళ్ల వద్దనే ఎక్కువగా ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే అక్కడక్కడ రోడ్ల మార్గ మధ్యంలోను ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల వాహనదారుడు బోర్డును చూస్తే అతని దృష్టి మళ్లి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆయా రూట్లలో ఏర్పాటు చేసిన బోర్డులను మరోసారి పరి శీలించి, ప్రమాదాలు జరిగే అవకాశాలుంటే వాటి విషయంలో తగిన విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు.

423
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...