ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు


Fri,March 16, 2018 02:37 AM

-కలెక్టర్‌ను ఆదేశించిన పురపాలక మంత్రి కేటీఆర్
-కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై పేట్‌బషీరాబాద్
-పీఎస్‌లో కేసు నమోదు
మేడ్చల్ కలెక్టరేట్: జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని గల సర్వే నంబర్ 121 చెరువు శిఖం భూమిలో రంగినేని రంగారావు అనే వ్యక్తి గత ఈనెల13న అక్రమంగా శిఖం భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో సమాచారం అందుకున్న స్థానిక రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణాల కట్టడాలను నిలుపుదల చేసే క్రమంలో రెవెన్యూ సిబ్బందిపై దుర్భషలాడుతూ బెదిరించిన ఘటనపై రాష్ట్ర పట్టణ,పురపాలక మంత్రి కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ మేరకు జరిగిన సంఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశించారు.ఈ మేరకు కలెక్టర్ ఎంవీరెడ్డి చెరువు శిఖం భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న రంగినేని రంగారావుపై చర్యలు తీసుకోవాలని పేట్‌బషీరాబాద్ పోలీసులను ఆదేశించారు.కాగా పోలీసులు గురువారం నిందితుడు రంగినేని రంగారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ఎక్కడైనా,ఎవరైనా ప్రభుత్వ భూములు,చెరువు శిఖాలు,కుంటల్లో ఆక్రమణలనుతొలగించే క్రమంలో రెవెన్యూ సిబ్బందిని దూషించి వారిపై బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశించారు.

అలాగే ప్రముఖుల పేర్లు చెప్పి ప్రభుత్వ భూములు కబ్జా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవీరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకు 45 అక్రమ లేఔట్లు,266 అక్రమ కట్టడాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి 28 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు మరో 22 మంది సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.వీరిలో 9 మందిని కూడా సస్పెండ్ చేశామని వెల్లడించారు.మరో ముగ్గురు సిబ్బందికి ఇంక్రిమెంట్‌లో కోత విధించామని అన్నారు. అదే విధంగా 20 మంది సర్పంచులకు షోకాజ్ నోటీస్ జారీ చేసి 16 మందిపై కేసులు నమోదు చేసి నలుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వారు ఎంతటి వారైనా సరే ఎంత మాత్రం ఉపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు.

349
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...