ఆకట్టుకున్న వైజ్ఞానిక శాస్త్రీయ ప్రదర్శన


Fri,March 16, 2018 02:36 AM

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 15: జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహిస్తున్న టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థులు వైజ్ఞానిక శాస్త్రీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆవిష్కరణలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. రెండోరోజు టెక్నికల్ ఫెస్ట్‌లో సివిల్ ఇంజినీరింగ్ -స్తాపత్య, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- ప్రజ్ఞ, మెకానికల్-కొనైజెంట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-స్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్ -క్వెస్ట్, మెటలర్జీ- ఆమూస్, కెమికల్-జీనోస్, మేనేజ్‌మెంట్ -ఐదీప్2018 వేదికలపై విద్యార్థులు పలు ఆవిష్కరణలు ప్రదర్శించడంతోపాటు పేపర్ ప్రజెంటేషన్, క్విజ్ పోటీలను నిర్వహించారు. స్తాపత్య వేడుకల్లో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలో మిషన్ భగీరథలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నమూనా ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది. కాళేశ్వరం నుంచి మేడిగడ్డ మల్లన్నసాగర్ వరకు గోదావరి నది నీటిని పొలాలకు అందించే విధానాన్ని నమూనా ద్వారా వివరించారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్‌లో నిర్వహించిన ప్రదర్శనలు, ఆవిష్కరణ పోటీల్లో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొనగా ప్రతిభను చాటిన జేఎన్‌టీయూహెచ్ జగిత్యాల, సీబీఐటీ, సిద్ధార్థ కళాశాల విద్యార్థులు వరుసగా మూడుస్థానాల్లో నిలిచి బహుమతులను కైవసం చేసుకున్నారు. కోడ్‌కింగ్, పేపర్ ప్రజెంటేషన్, టెక్‌క్విజ్ పోటీల్లో ప్రతిభను చాటినవారికి బహుమతులందించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో రోబోటిక్ ప్రదర్శనలు ఆకట్టుకోగా, పలు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనలు కనబర్చినవారు ప్రత్యేక ప్రశంసలు పొందారు.

విద్యార్థుల జోష్...: విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానంతో ప్రదర్శనలు రూపొందించి ఆకట్టుకుంటుండగా, మరికొందరు క్విజ్, పేపర్ ప్రజెంటేషన్, సంస్కృతిక కార్యక్రమంలు, మేథోసంపత్తిని పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాయంకాలం టెక్నికల్ ఫెస్ట్ ముగింపులో భాగంగా బృంద నృత్యాలు, బైక్ ర్యాలీలు చేస్తూ విద్యార్థులంతా జోష్‌గా వేడుకలకు ముగింపు పలికారు.

227
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...