ప్లాట్ల వేలానికి వేళాయే !


Thu,March 15, 2018 02:59 AM

-రేపు హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్ నోటిఫికేషన్ జారీ
-146ప్లాట్లు, 91చోట్ల గిఫ్ట్‌డీడ్ స్థలాలను వేలం
-మార్గదర్శకాలు సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపర్చుతాం
-హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ ఎండీఏ) మళ్లీ ప్లాట్ల వేలానికి సిద్దమైంది. ప్రస్తుత రియల్ భూం జోరు మీదున్న నేపథ్యంలోనే సంస్థకు సంబంధించిన లే అవుట్లలోని మిగిలిపోయిన ఖాళీ స్థలాలను వేలం వేసి సంస్థ ఖజానాను పటిష్టం చేసుకోవాలని యం త్రాంగం భావించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఇటీవల అమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగానే సంస్థ గతంలో చేసిన లే అవుట్లలోని మిగిలిపోయిన స్థలాలు, గిఫ్ట్‌డీడ్ స్థలాలను పారదర్శకంగా వేలం ప్రక్రియను చేపట్టాలని కమి షనర్ చిరంజీవులు నిర్ణయించారు. మియాపూర్, చందానగర్, అత్తాపూర్ సర్వే నెం. 366, మాదాపూర్, వనస్థలిపురం, నల్లగండ్ల, జూబ్లీహిల్స్, తెల్లా పూర్, నెక్నాంపూర్, సరూర్‌నగర్ రెసిడెన్సీ కాంప్లెక్స్, గోపన్‌పల్లి, చిత్రా లే అవుట్, హకీంపేట హుడా హైట్స్, హుడా ఎన్‌క్లేవ్, నందనగిరి హిల్స్, రామ చంద్రాపురం ప్రాంతాలలో ఈ ప్లాట్ల వేలం ఉండనుంది. అధికారులు వేలం వేసే ప్లాట్లను జియో ట్యాగ్ చేశారు. ఆయాప్లాట్లు (స్ధలాల) సమగ్ర వివరా లను సేకరించి సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. రేపు ( ఈ నెల 16న) ఆన్‌లైన్ వేలానికి సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నామని కమీషనర్ చిరంజీవులు తెలిపారు. కాగా ఈ గిఫ్ట్‌డీడ్, ప్లాట్ల వేలం ద్వారా సంస్థ ఖజానాలోకి రూ.300కోట్ల మేర ఆదాయం సమ కూర్చుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంస్థ వద్ద కొన్నేండ్ల నుంచి అమ్ముడు కాకుండా మిగిలిపోయిన ప్లాట్లను వేలం వేయడానికి ఇటీవల పురపాలక శాఖ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. సంస్థ పరిధిలో చాలా ఏండ్లుగా అస్తవ్యస్తంగా అనేక ప్లాట్లు ఖాళీగా పడిఉన్నాయి. వీటిని గుర్తించి ఆన్‌లైన్ ద్వారా వేలం వేసేందుకు అవసరమైన మార్గదర్శ కాలను మున్సిపల్‌శాఖ ఖరారు చేసింది. ప్లాట్లకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువ ఎంత ఉన్నదో దాన్ని పరిగణనలోకి తీసుకొని దానిపై ఒకటిన్నర రెట్లు అధికంగా తుది ధర ఉండేటట్లుగా నిర్ణయించి, ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచుతారు. వేలంలో పాల్గొనాలనుకొనేవారు ప్రభుత్వం నిర్దేశిం చిన ధరలో పదిశాతం ముందుగా చెల్లించాలి. వేలంలో ప్లాటును సొంతం చేసుకొంటే, వారం రోజుల్లోపు పాతికశాతం సొమ్మును చెల్లించాలి. మిగతా సొమ్మును రెండు నెలలలోపు కట్టాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో తొలిసారి కొనుగొలుదారులెవరూ రాకపోతే.. ఆ వేలాన్ని రద్దుపరిచి.. రెండోసారి వేలం వేస్తారు. అప్పుడు కూడా రాకపోతే.. ఆరు నెలలపాటు వేలంపాటను రద్దు చేస్తారు. ఒక ప్లాటుకు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకొంటే.. ప్రామాణిక ధరకంటే ఎక్కువకు కోట్ చేయాల్సి ఉంటుంది.

945
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...