ఆర్‌బీఎస్‌కేల పనితీరును మెరుగుపరచండి


Thu,March 15, 2018 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆర్‌బీఎస్‌కేల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రతి మండలానికి ఒక యూనిట్‌ను పరిధిగా మార్చనున్న ట్లు జిల్లా కలెక్టర్ యోగితా రాణా తెలిపారు. బుధవారం కలె క్టరేట్‌లో ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్ డా. శ్రీకళ, ఇతర మెడికల్ ఆఫీసర్లతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నెలవారీగా చేపట్టే కార్యక్రమాలపై మూడు నెలలకు షెడ్యూల్డ్‌ను రూ పొందించాలని కలెక్టర్ నిర్ధేశించారు. క్షేత్రస్థాయిలో సమన్వయాన్ని పెంచేందుకు సీనియర్ వైద్యాధికారి ఆధ్వర్యం లో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, డిప్యూటీ డీఈ ఓలు, విద్యా పర్యవేక్షకులు, ప్రధానో పాధ్యాయులు, సీడీపీఓలతో సమీక్షలు నిర్వహించి, మినిట్స్‌ను పంపాలని కలెక్టర్ ఆదేశించారు. షెడ్యూల్డ్ ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినప్పుడు సంబంధిత తరగతి ఉపాధ్యాయులు హాజరు అయ్యేందుకు ముందస్తుగా సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి బయో డెటాను, ఆధార్ నంబరును ఆర్‌బీఎస్‌కే వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు.

సమ్మర్ కోచింగ్ క్యాంపుపై కలెక్టర్ సమీక్ష
వేసవిలో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాం పు నకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం జిం ఖానా స్టేడియంలో రూ.20లక్షల వ్యయంతో కనీసం మౌలిక వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో యు వజన క్రీడాభివృద్ధి అధికారి సుధాకర్, ఈఈ సాంబయ్యలతో జిం ఖానా స్టేడియంలో ఉన్న సదుపాయాల గురించి కలెక్టర్ బుధవారం చర్చించా రు. నేడు ఉదయం 7 గంటలకు జింఖానా స్టేడియంను సందర్శించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.

275
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...