నేటి నుంచి టెన్త్ పరీక్షలు


Thu,March 15, 2018 02:56 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పదో తరగతి వార్షిక పరీక్షలు 15వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖాధికారిణీ బి.వెంకటనర్సమ్మ తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో విలేకర్లతో డీఈవో వెంకటనర్సమ్మ బుధవారం మాట్లాడారు. ఉదయం 8:40 లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులు కలిపి 79817 మంది పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్ జిల్లాలో 353 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెట్స్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్, సిట్టింగ్ స్కార్డ్, ఇన్విజిలేటర్ల, ైప్లెయింగ్ స్కార్డ్‌లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నా మన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల్లో మౌళిక సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ను WWW. bsetelangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తీసుకొవాలని డీఈవో తెలిపారు. అనుమానాలను నివృత్తిని చేసుకునేందుకు డీఈవో ఎస్సెస్సీ హెల్ఫ్-04065537350, డీఈవో పేషీ-04023237350 హెల్ప్‌లైన్ నెంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.

ప్రతి రోజు వెయ్యి ప్రత్యేక బస్సులు
పదవ తరగతి పరీక్షలకు గ్రేటర్ పరిధిలో ప్రతీరోజు 1,000 ప్రత్యేక బస్సు లును గ్రేటర్ ఆర్టీసీ ఆపరేట్ చేయనుంది. ప్రతీ డిపో నుంచి 30 నుంచి 40 బస్సులను నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ తెలిపారు. బస్సులు సక్రమంగా నడపడానికి ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు, మధ్యా హ్నం 12.15 గంటల నుంచి 3 గంటల వరకు మేజర్ బస్‌స్టాప్‌లలో సూ పర్ వైజర్ స్టాప్ ను నియమించినట్లు తెలిపారు. 6 జీపులలో ఎన్‌ఫోర్స్ మెం ట్ టీం బస్సుల ఆపరేషన్స్ సరిగ్గా జరిగేలా పర్యవేక్షిస్తుందని అన్నారు. విద్యా ర్థులు బస్సుల రాకపోకల కోసం కమ్యూనికేషన్ సెంటర్‌ను సంప్రదిం చాలని అన్నారు. కోఠి స్టేషన్‌లో ఉన్న 9959226160తోపాటు రేతిఫైల్ స్టేషన్ 9959226 154 నంబర్లను సంప్రదించగలరని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత లేదా రాయితీతో కూడిన బస్సు పాస్‌లు చెల్లుబాటవుతాయని పేర్కొన్నారు. కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ప్రయాణించవచ్చన్నారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...