రెస్టారెంట్ ముసుగులో హుక్కాలు, మద్యం సరఫరా


Thu,March 15, 2018 02:47 AM

హట్‌కే రెస్టారెంట్ నిర్వాహకుడు అరెస్ట్
బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్‌లో హుక్కాలు నడపడంతో పాటు మద్యాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.44లోని పెద్దమ్మ దేవాలయం పక్క వీధిలో ఉన్న హట్-కే రెస్టారెంట్‌లో కొంతకాలంగా హుక్కాలు సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దానిపై దాడి చేశారు. ఈ దాడుల్లో హుక్కాలతో పాటు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. యజమాని కిషోర్(34)తో పాటు హుక్కాలను సరఫరా చేస్తున్న ఎస్.శేఖర్(38) ను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...