బల్దియా కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కేవీ ముందంజ


Tue,March 13, 2018 11:49 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బల్దియా కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేవీ అనుబంధ జీహెచ్‌ఎంఈయూ ముందంజలో ఉందని, మరోసారి తమ యూనియన్ గెలుపు తధ్యమని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. కార్మికులు, ఉద్యోగుల్లో సీఎం కేసీఆర్‌పై ఉన్న విశ్వాసమే తమని గెలిపిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆశా వర్కర్లనుంచి అంగన్‌వాడీ వర్కర్ల వరకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వేతనాలు పెంచారని , ఇతర బెన్‌ఫిట్స్ కల్పించారని గుర్తు చేశారు. హోమ్‌గార్డులు, వీఆర్‌ఏలు, వీఓఏలు, కాంట్రాక్టు ఉద్యోగులు, జీహెచ్‌ఎంసీలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేలాదిమంది ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో పనిచేసే పారిశుధ్య కార్యికుల వేతనాలను రూ. ఎనిమిది వేలనుంచి రూ. 14000లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇండ్ల పట్టాలు సైతం ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని, త్వరలోనే స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన అందజేస్తామన్నారు. టీఆర్‌ఎస్ కేవీ అనుబంధ యూనియన్ గతంలో విజయం సాధించిన అనంతరం అర్హులైన ఉద్యోగులందరికీ అర్హతలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించినట్లు చెప్పారు. హెల్త్‌కార్డులు వచ్చే ఉగాదిలోగా ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఇండ్ల స్థలాలకు సంబంధించిన ప్రక్రియ చేపడతామని , వేతనాల పెంపు వంటి వాటికి కృషి చేస్తానన్నారు. బల్దియా ఎన్నికల్లో జాతీయ సంఘాలైన ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌లు కార్మికులకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఈ యూనియన్లకు కాలం చెల్లిందని, అందులోని మెజార్టీ సభ్యులు తమ యూనియన్‌లో చేరుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే హెచ్‌ఎంఎస్‌సహా పలు ప్రధాన సంఘాలు తమకు మద్దతు ప్రకటించినట్లు పేర్కొన్నారు. దళిత, బలహీన వర్గాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులకు బాసటగా ఆ వర్గానికి చెందిన గోపాల్‌ను మరోసారి అధ్యక్షుడిగా బరిలో నిలిపినట్లు చెప్పారు.

377
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...