జేఎన్‌టీయూహెచ్‌లో పండుగ.. నేటినుంచే!


Tue,March 13, 2018 11:48 PM

కేపీహెచ్‌బీ కాలనీ : జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో సాంకేతిక పండుగ (టెక్నికల్ ఫెస్ట్)ను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఈఏడాది జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో టెక్నికల్ ఫెస్ట్-2018 (సాంకేతిక వైజ్ఞానిక ప్రదర్శనల సదస్సు)ను నిర్వహించడానికి జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా నిర్వహిస్తున్న టెక్నికల్ ఫెస్ట్‌లో వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆయా కోర్సులను చదువుతువున్న విద్యార్థులతో పాటు ఇతర కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి ఆస్కారం ఉంది.

ఆవిష్కరణల ప్రదర్శన
టెక్నికల్ ఫెస్ట్‌లో ప్రధానంగా విద్యార్థుల పేపర్ ప్రెజెంటేషన్, ఆయా కోర్సులకు సంబంధించిన విజ్ఞానం (క్విజ్), సొంత ఆలోచనలతో తయారు చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తల అనుభవాలు, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాలపై ప్రత్యేక అవగాహన తరగతులు ఉంటాయి. మరోవైపు టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థులంతా కలిసి ప్రదర్శనలు ఇస్తుండడంతో బృందంతో పనితీరు, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి.

నూతన ఆవిష్కరణలకు వేదిక
జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో టెక్నికల్ ఫెస్ట్-2018 వేడుకలు నూతన ఆవిష్కరణలకు వేదిక కానున్నాయి. నేడూ రేపు (మార్చి 14, 15)తేదీలలో జరుగనున్న టెక్నికల్ ఫెస్ట్‌లో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులందరు పాల్గొని నైపుణ్యాలు ప్రదర్శించనున్నారు. గతంలో టెక్నికల్ ఫెస్ట్‌లు ఆయా ఇంజినీరింగ్ కోర్సుల విభాగాల వారు ప్రత్యేకంగా నిర్వహించేవారు. దీనివల్ల కళాశాలలో తరగతుల నిర్వహణ, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో అన్ని విభాగాలకు కలిపి రెండ్రోజుల్లో వేడుకలు నిర్వహించుకునేలా షెడ్యూల్‌ను మార్చారు. ఈయేడాది టెక్నికల్ ఫెస్ట్‌లో వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని 7 బ్రాంచ్‌ల ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు ఎంబీఏ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆయా విభాగాల ఇంజినీరింగ్ విద్యార్థులే టెక్నికల్ ఫెస్ట్‌కు సమన్వయకర్తలుగా పనిచేస్తూ సంబంధిత విభాగాల అధికారుల సహకారాన్ని తీసుకుని నిర్వహించడం విశేషం.

16న కళాశాల వార్షికోత్సవం
జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వార్షికోత్సవాన్ని ఈనెల 16న నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎ.వేణుగోపాల్‌రెడ్డి, టెక్ మహేంద్ర సీనియర్ వైస్ ప్రెసిండ్ బి.కె.మిశ్రాలు హాజరుకారున్నారు. కాలేజ్ డే వేడుకల్లో కళాశాలలోని వివిధ విభాగాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించడం, క్రీడ, సాంస్కృతిక, ఇతర రంగాల్లో ప్రతిభను చాటిన విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు తెలపడం, కళాశాల ప్రగతిపై నివేదికను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని కళాశాల అధికారులు వివరించారు.

నైపుణ్యాల ప్రదర్శనకు వేదిక..
జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల నైపుణ్యాలను ప్రదర్శించేందుకు టెక్నికల్ ఫెస్ట్ చక్కని వేదిక. ఇంజినీరింగ్ కళాశాలలో అన్ని బ్రాంచీలకు కలిపి ఒకేసారి టెక్నికల్ ఫెస్ట్‌ను నిర్వహించడం వల్ల సమయం ఆదా అవుతుంది. రెండ్రోజుల ఈ సదస్సులో విద్యార్థులు నైపుణ్యాలు, సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేందుకు వీలు కలుగుతుంది. టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు చదవాల్సిన, నేర్చుకోవాల్సిన, ఇండస్ట్రీకి అవసరమైన అంశాలపై అవగాహన కలుగుతుంది. టెక్నికల్ ఫెస్ట్ కోసం అన్ని బ్రాంచీలలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా ఈనెల 16న కళాశాల వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు.
-ఈ.సాయిబాబారెడ్డి, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల

297
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...