బాధ్యతలు స్వీకరించిన కొత్త కొత్వాల్


Tue,March 13, 2018 04:53 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:నగర పోలీసు కమిషనర్‌గా అంజనీకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ ఉత్తమ పనితీరుతో అనేక అవార్డులు అందుకున్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా కొ నసాగిన వీవీ శ్రీనివాసరావు సోమవారం అంజనీకుమార్‌కు బాధ్యతలను అప్పగించారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నర్సింహన్‌ను, డీజీపీ మహేందర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్‌కు మూడో పోలీస్ కమిషనర్‌గా అంజనీకుమార్ బాధ్యతలను నిర్వహించనున్నారు.

1990వ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, గుంటూరు ప్రకాశం జిల్లాలతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అదనపు సీపీ( లా అండ్ ఆర్డర్), వరంగల్ రీజియన్ ఐజీ, నిజామాబాద్ రేంజ్ డీఐజీ, గ్రేహౌండ్స్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అదనపు డీజీపీగా పదోన్నతి పొందిన తరువాత రాష్ట్ర స్థాయిలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. అంజనీకుమార్ సేవలను గుర్తించిన కేంద్రం ఇండియన్ పోలీస్ మెడల్, రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను కూడా ప్రదానం చేసింది. అంజనీకుమార్ భార్య వసుందర సిన్హా , ఐఆర్‌ఎస్ అధికారిణి. వీరికి ఇద్దరు కొడుకులు.

గుర్రపు స్వారీని అంజనీకుమార్ ఎక్కువగా ఇష్టపడుతారు. ఆయన గుర్రపుస్వారీలో మహారాజా ఆప్ టోంక్ కప్‌లో బెస్ట్ హార్స్ రైటర్ అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతోపాటు బెస్ట్ స్విమ్మర్ అవార్డుతో పాటు బాస్కెట్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా గతంలో కొనసాగారు. సర్ధార్ వల్లాబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలోనే స్పోర్ట్స్‌లలో వివిధ ట్రోపీలను గెలుపొందారు.

614
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...