నమస్తేకు ఏబీసీ గుర్తింపు


Tue,March 13, 2018 04:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : 3, 13,876 సర్యూలేషన్‌తో తెలంగాణ ఆత్మ గౌరవ పత్రిక నమస్తే తెలంగాణను ఏబీసీ అధికారికంగా ధ్రువీకరించిన సందర్భంగా బంజారాహిల్స్‌లోని పత్రిక ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తీన్‌మార్ నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో నమస్తే తెలంగాణకు ఏబీసీ సర్టిఫికెట్ రావడం గర్వకారణమన్నారు. ప్రధాన స్రవంతి పత్రికలకు 30 ఏండ్ల అనుభవం తర్వాతే ఏబీసీ సర్టిఫికెట్ దక్కిన సందర్భాలున్నాయని, కానీ నమస్తే తెలంగాణ శిశువుగా ఎదుగుతూనే ఏడేండ్ల కాలంలోనే ఈ ఘనత సాధించిందన్నారు. పోటీ పత్రికలను వెనక్కినెట్టి ఉత్తర తెలంగాణలోని 20 జిల్లాల్లో రెండో స్థానంలో ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో సిబ్బంది పనిచేసి, ప్రజల మన్ననలను పొందాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ టు డే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ వి.రామారావు, అసిస్టెంట్ ఎడిటర్ కృష్ణమూర్తి, టెక్నికల్ జీఎం సీహెచ్ శ్రీనివాస్, సర్కులేషన్ జీఎం రామిరెడ్డి, ప్రకటనల విభాగం జీఎం రవీంద్రనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.

306
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...